18-11-2025 04:23:01 PM
అన్నదానంలో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): కార్తీక మాసం.. మాస శివరాత్రిని పురస్కరించుకొని మంగళవారం సుల్తానాబాద్ పట్టణంలోని గుడి మిట్టపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో శివుడికి అన్నపూజ వేడుకలను ఆలయ అర్చకులు పోలాస అశోక్ ఎంతో వైభవంగా కన్నుల పండువగ నిర్వహించారు. ఈ సందర్భంగా శివుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. అన్న పూజ అనంతరం భక్తులు ఆ శివుని దర్శించుకున్నారు.
ప్రసాదాలు స్వీకరించారు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని భజనలు చేశారు. స్వామివారికి అన్న పూజా అనంతరం నిర్వహించిన అన్నదానం (అన్న ప్రసాద వితరణ) కార్యక్రమంలో సుల్తానాబాద్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు... అలాగే కార్తీక మాసం చివరి మంగళవారంను పురస్కరించుకొని శివాలయాల్లో పూజారులు శివుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఆలయ నిర్వాహకులు, భక్త బృందం పెద్ద ఎత్తున పాల్గొన్నారు.