calender_icon.png 18 November, 2025 | 5:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు సంతోషంగా ఉంటే మార్కెట్ ఎందుకు బంద్

18-11-2025 04:14:24 PM

* తమ పోరాటంతో వేలిముద్ర నిబంధన తొలగింపు

*ఆదిలాబాద్ పర్యటనలో కేసీఆర్

ఆదిలాబాద్,(విజయక్రాంతి): పత్తి రైతుల సమస్యను తెలుసుకునేందుకు ఆదిలాబాద్ కు తాను వస్తున్నానంటే ప్రభుత్వంలో కొంత కదలిక, సిగ్గు వచ్చిందనీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం మార్కెట్ యార్డులో రైతులతో ముఖాముఖి లో పాల్గొన్నారు. మీరు ఎలాంటి తప్పు చేయకపోతే, మీరు అన్ని సరిగ్గా చేపడితే, రైతులు సంతోషంగా ఉన్నారంటే మరి ఇవ్వాళ మార్కెట్ లో పత్తి కొనుగోళ్లు ఎందుకు బంద్ కొనసాగుతోంది చెప్పాలని ప్రభుత్వం ను ప్రశ్నించారు.

తాను రైతులను కలుసుకునేందుకు వస్తున్నానన్న విషయం తెలుసుకొని ఫింగర్ ప్రింట్ నిబంధనలను తొలగించడం జరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. అదేవిదంగా సోయా ఎకరానికి 7 క్వింటాళ్ల మాత్రమే కొనుగోలు నిబంధనలను తొలగిస్తూ తాజాగా ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం తీసుకోవడం తమ పోరాట విజయం అన్నారు. గతంలో తమ ప్రభుత్వం అధికారం ఉన్నపుడు తేమ శాతం నిబంధన లేకుండా పత్తి కొనుగోళ్లు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవలక్ష్మి, మాజీ మంత్రి జోగు రామన్న, ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పలువురు బిబీఆర్ఎస్ నాయకులు ఉన్నారు