ఎన్నికల బాండ్లలో ఏదీ పారదర్శకత?
ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేస్తూ సీజేఐ డివై చంద్రచూడ్, జస్టిస్‌లు సంజీవ్ ఖన్నా, బిఆర్ గవాయ్, జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ఐదు గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును వెలువరించింది. అనామక ఎలక్టోరల్ బాండ్లు సమాచార హక్కు, ఆర్టికల్ 19(1)(ఎ)ని ఉల్లంఘించడమే అని సుప్రీంకోర్టు సీజేఐ అన్నారు.
క్విడ్ ప్రోకో ప్రయోజనాల కోసం
ఎలక్టోరల్ బాండ్ల జారీని నిలిపివేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సుప్రీంకోర్టు ఆదేశించింది. కాని భారత ఎన్నికల కమిషన్‌కు మొత్తం సమాచారాన్ని వెల్లడించాలని బ్యాంకును కోరింది. కంపెనీలు ఇచ్చే విరాళాలు పూర్తిగా క్విడ్ ప్రోకో ప్రయోజనాల కోసం మాత్రమే కాబట్టి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కార్పొరేట్ కంట్రిబ్యూటర్ల సమాచారాన్ని తప్పని సరిగా బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
సుప్రీంకోర్టు ధర్మాసనం అనేక ప్రశ్నలు సంధించింది. అందులో ఒకటి ఏమిటంటే ఎస్‌బీఐ తరపున ఎవరు కోర్టుముందున్నారు? ఎవరు కొనుగోలు చేశారు? ఏ పార్టీ పక్షాన విరాళాలు వచ్చా యి?వివరాలన్నీ ఎందుకు ఇవ్వటం లేదనేది. నెంబర్లు కూడా ఇవ్వాలని చెప్పారు కదా అయినా సుప్రీంకోర్టు చెప్పినా వినరా అనేది మన ముందున్న ప్రశ్న. ఇది అర్థం చేసుకోకపోతే దీని వెనుక ఒక సమస్య ఉందనుకోవాలి. ఇదంతా సమాచార చట్టానికి సంబంధించిన విషయం. సమాచార హక్కుకు సంబంధించిన విషయం.
ఆ సమాచారంతో ముడిపడిన ఆర్టికల్ 19(1)(ఏ) కింద ఉన్న ప్రాథమిక అధికారానికి సంబంధించిన విషయం. ఆ వివరాలు అడగడం కూడా ఆర్టికల్ 19 కింద హక్కుల కిందికే వస్తుంది. అంతే కాదు, వెబ్‌సైట్‌లో ఈ మొత్తం వివరాలు కూడా అడిగారు.
చారిత్రాత్మక తీర్పు
అన్నింటికన్నా తీవ్రమైన సమస్య ఏమిటంటే ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు చారిత్రా త్మకమైన తీర్పు ఇచ్చింది.ఎన్నికల బాండ్ల ను పూర్తిగా రద్దు చేయాలని తీర్పు చెప్పిం ది. అయినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రభుత్వం ప్రజలకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా లేవు. ఒక ఉదాహరణ ఏమిటంటే ఆల్ఫా నెంబర్లు అడిగితే ఇవ్వలేదు. ఏ పార్టీకి ఎన్ని బాండ్లు వచ్చాయనీ, రాలేదనీ చెప్పడం లేదు. పూర్తి డేటా ఎందుకు ఇవ్వట్లేదు. నిజానికి తీర్పులో పూర్తి ఆదేశాల వివరాలు ఉన్నాయి. ఎందుకు, ఎంత కు కొన్నారు? ఎవరికి చేరింది? ఏ పార్టీలకి ఎక్కువగా వచ్చాయి. తక్కువ వచ్చాయి? అనే ప్రశ్నలకి జవాబులు ఆ తీర్పులో ఉన్నాయి.
కానీ దానికి ఎస్‌బీఐ పూర్తిగా సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా లేదు. అందుకే ప్రతిపక్షాల వాళ్లు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నాయకుడు స్వతంత్ర భారతదేశంలో ఇది అతి పెద్ద స్కాం అన్నారు. అంతేకాదు బీజేపీ తదితర పార్టీల ఎలక్టోరల్ బాండ్ల వివరాలు దానికి సంబంధించిన కోట్ల నిధులను, ఆ బ్యాంకు ఖాతాలను నిలిపి వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ పని చేయట్లేదు. అంతేకాకుం డా ఐటీ, ఈడీ, ఇతర సంస్థలు చేస్తున్న పని ఏమిటని అందరికీ అనుమానాలు వస్తున్నా యి. ఇది చట్టబద్ధమైన లంచం అని చిదంబరం వర్ణించారు. ఎక్కువ లాభించింది బిజెపికే అని విమర్శిస్తున్నారు.
ఇన్ని కోట్లూ లంచాలేనా?
దేశంలోనే అత్యధికంగా అధికార బీజేపీ రూ.6,060.5 కోట్లను ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అందుకుంది. ఎన్‌క్యాష్ చేసుకున్న బాండ్లలో దాదాపు 47% వాటా బీజేపీదే. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రూ. 1600 కోట్లకుపైగా, కాంగ్రెస్ పార్టీకి రూ.1400 కోట్లకుపైగా నిధులు బాండ్ల ద్వారా అందాయి. కాగా, అన్ని పార్టీలకు ఆయా పార్టీల పేర్ల మీద ఎన్నికల బాండ్లు అందగా కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలకు మాత్రం అధ్యక్షుల పేర్లతో బాండ్లు అందా యి. ఎక్కువ ఎలక్టోరల్ బాండ్లను కోయంబత్తూరు కేంద్రంగా పని చేసే ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ సంస్థ కొనుగోలు చేసింది. వేర్వేరు పేర్లతో ఈ సంస్థ కేరళ, సిక్కిం తదితర రాష్ట్రాల్లో లాట రీ వ్యాపారం నిర్వహిస్తున్నది. ఈ సంస్థ రూ.1,368 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. లాటరీ కింగ్‌గా పేరున్న మార్టిన్ శాన్టియాగో ఈ సంస్థకు యాజమాని. ఈ సంస్థపై మనీలాండరింగ్ ఆరో పణలతో ఈడీ విచారణ జరుపుతున్నది.
వివరాల్లో వ్యత్యాసం ఎందుకు?
ఈసీ వెల్లడించిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలపై కాంగ్రెస్ పార్టీ పలు అనుమానాలను లేవనెత్తింది. దాతల వివరాల్లో 18,871 ఎంట్రీలు ఉండగా, బాండ్లు అందుకున్న వారి వివరాల్లో 20,421 ఎంట్రీలు ఎందుకున్నాయని, ఈ వ్యత్యాసానికి కారణమేంటని కాంగ్రెస్ నేత అమితాబ్ దూబే ఎక్స్‌లో ప్రశ్నించారు. ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని 2017లో ప్రవేశపెట్టగా ఇప్పుడు వెల్లడించిన వివరాల్లో మాత్రం 2019 ఏప్రిల్ నుంచే ఎందుకున్నాయని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది.
ఎలక్టోరల్ బాండ్ల కేసులో మార్చి 11న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఎన్నికల కమిషన్ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. ఇంతకుముందు ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పించిన స్టేట్‌మెంట్లను ఈసీ కార్యాలయంలో పెట్టాలని సుప్రీంకోర్టు మార్చి 11న ఈసీని ఆదేశించింది. అయితే, పారదర్శకత పాటించేందుకు గానూ ఈ డాక్యుమెంట్ల కాపీలను తమ వద్ద పెట్టుకోలేదని, కాబట్టి కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లను తిరిగివ్వాల్సిందిగా సుప్రీంకోర్టును ఈసీ కోరింది.
కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2017-18 కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తున్నప్పుడు, 70 సంవత్సరాల స్వాతంత్య్రం తర్వాత, దేశం స్వేచ్ఛా న్యాయమైన వ్యవస్థకు కీలకమైన రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చే పారదర్శక పద్ధతిని అభివృద్ధి చేయలేకపోయిందని అంటూ ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని ప్రతిపాదించారు. ఇది రాజకీయ నిధుల వ్యవస్థను ప్రక్షాళన చేయడానికని చెప్పుకున్నారు.ఎలక్టోరల్ బాండ్ అనేది ప్రామిసరీ నోటు లాంటిది. ఇది బేరర్‌కు డిమాండ్‌పై చెల్లించాల్సిన బేరర్ పరికరం. చెల్లింపుదారు, చెల్లింపుదారు వివరాలను కలిగి ఉన్న ప్రామిసరీ నోట్ వలె కాకుండా, ఎలక్టోరల్ బాండ్‌లో లావాదేవీలోని పార్టీల గురించి ఎటువంటి సమాచారం ఉండదు. ఇది పార్టీలకు పూర్తి అజ్ఞాతమైనవి. పూర్తిగా గోప్యతను పాటిస్తారు.
ఎలక్టోరల్ బాండ్ చట్టపరమైందా?
2016 మే 14న ఆర్థిక చట్టం 2016 అమల్లోకి వచ్చింది. ఇది ‘విదేశీ మూలం’ను నిర్వచించే ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, 2010 (ఎఫ్‌సీ ఆర్‌ఏ) లోని సెక్షన్ 2(1)(జే)(vi)ని సవరించింది. ఇది భారతీయ కంపెనీలలో మెజా రిటీ వాటాను కలిగి ఉన్న విదేశీ కంపెనీలను రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి అనుమతించింది. గతంలో, ఎఫ్‌సీఆర్‌ఏ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, 1999 ప్రకారం రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వకుండా విదేశీ కంపెనీలను నిషేధించాయి. 2017 మార్చి 31న, ఫైనా న్స్ యాక్ట్, 2017 ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 (ఆర్‌ఓపీఏ), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934, ఆదాయపు పన్ను చట్టం 1961, కంపెనీల చట్టం, 2013లను కేంద్రం సవరించింది.
ఆర్థిక చట్టం, 2017లోని సెక్షన్ 11, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 13ని సవరించింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చిన విరాళాల వివరాలను రాజకీయ పార్టీలు ఉంచుకోకుండా మినహాయించింది. సెక్షన్ 135 ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్ 31ని సవరించింది. ఇది ఎలక్టోరల్ బాండ్‌లు జారీ చేయడానికి ఏదైనా షెడ్యూల్ బ్యాంక్‌కు అధికారం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతించింది.
సెక్షన్ 137 ఆర్‌ఓపీఏ యొక్క సెక్షన్ 29కి ఒక నిబంధనను ప్రవేశపెట్టింది, కంట్రిబ్యూషన్ రిపోర్ట్‌లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పొందే విరాళాలను ప్రచురించడం నుండి రాజకీయ పార్టీలను మినహాయించింది. ఈ నివేదికలు కంపెనీలు, వ్యక్తుల నుండి ఇరవై వేల రూపాయల కంటే ఎక్కువ పార్టీలు స్వీకరించిన విరాళాలను వెల్లడిస్తున్నాయి. సెక్షన్ 154 కంపెనీల చట్టం, 2013లోని సెక్షన్ 182ను సవరించింది. ఇది ఒక కంపెనీ రాజకీయ పార్టీకి ఎంత విరాళం ఇవ్వాలనే దానిపై ఉన్న గరిష్ట పరిమితిని తొలగించింది.
సవాళ్ళు
సవరణలు ప్రవేశపెట్టిన కొద్దిసేపటికే, సెప్టెంబర్ 2017, జనవరి 2018లో రెండు ప్రభుత్వేతర సంస్థలు, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), కామన్ కాజ్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ఈ సవరణలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పథకం రాజకీయ నిధులలో పారదర్శకతను అనుమతించలేదని, ఎన్నికల అవినీతిని భారీ స్థాయిలో చట్టబద్ధం చేసిందని పిటిషనర్లు వాదించారు.
స్కీమ్ లక్షణాలు
2018 జనవరి 2న, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్, 2018 ని ప్రవేశపెట్టిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 2018 పథకం కింద, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)కు చెందిన కొన్ని శాఖలు ఎలక్టోరల్ బాండ్లను విక్రయించడానికి అధికారం ఇచ్చారు. స్‌బీఐ నుండి 1,000, 10,000, 1,00,000, 10,00,000 అంతేగాక 1,00,00,000 విలువలతో బాండ్లను కొనుగోలు చేయవచ్చు. వాటిని ప్రతి సంవత్సరం జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్‌లలో 10 రోజుల పాటు విక్రయించాలి.
కొనుగోలుదారు గుర్తింపు ఎస్‌బీఐ మినహా అందరికీ అనామకంగా ఉంటుంది, కొనుగోలుదారు మీ కస్టమర్‌ను తెలుసుకోండి (కేవైసీ) వివరాలను నమోదు చేయాలి.‘ప్రజల సభకు లేదా శాసనసభకు గత సాధారణ ఎన్నికలలో ఒక శాతం కంటే ఎక్కువ ఓట్లను పొందిన రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలను స్వీకరించడానికి అర్హులు. రాజకీయ పార్టీలు బాండ్‌ను స్వీకరించిన 15 రోజుల్లోగా రిడీమ్ లేదా డబ్బుగా ఎన్‌క్యాష్ చేసుకోవాలి. ఈ వ్యవధి ముగిసిన తర్వాత నిధులు ప్రధానమంత్రి సహాయ నిధికి జమ చేస్తారు.
(తరువాయి రేపు)






