15 April, 2026 | 3:19 AM

మూడో మహిళా చైర్మన్ అప్పల కావ్య

16-02-2026 12:00 AM

నిర్మల్ ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు 13 మంది మున్సిపల్ చైర్మన్లు పనిచేశారు. అయితే ఇందులో 9 మం ది పురుషులు కాగా ముగ్గురు మాత్రమే మహిళలకు అవకాశం దక్కింది. మొదటి మహిళా మున్సిపల్ చైర్మన్‌గా అయ్యన్న గారి భూములు భూలక్ష్మి. రెండవ మున్సిపల్ చైర్మన్‌గా అప్పల అనురాధ, మూడవ మున్సిపల్ చైర్మన్ గా అప్పల కావ్య ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ముగ్గురు కూడా మున్నూ రు కాపు సామాజిక వర్గం చెందిన వారే కావడం విశేషం.