29 July, 2026 | 9:40 PM

Breaking News

మంథని మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   తెలంగాణ జలసిరిపై ప్రజలకు అవగాహన కల్పించిన పెద్దకాపర్తి సర్పంచ్   •   నల్లబండగూడెం సాయిమందిరంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు   •   గురుపౌర్ణమి సందర్భంగా సామూహిక ధ్యానం   •   ఆర్మూర్ ఎంఈవోగా రాజేశ్వర్   •   ఏజెన్సీలో భారీ వర్షాలు.. గిరిజన గ్రామాలకు రాకపోకలు బంద్   •   భిక్కనూర్ పీహెచ్‌సీలో వైద్య సేవలపై డైరెక్టర్ ఆకస్మిక తనిఖీ   •   సువర్ణ వనమాల దశదిన కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   రోటర్ డామ్ ఇంటర్నేషనల్ స్కూల్ కు ప్రతిష్టాత్మక ఆర్ఐడిఎస్ అంతర్జాతీయ అవార్డు   •   ఎర్రుపాలెం మండలంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు   •  

రసవత్తరంగా ఆదిలాబాద్ మున్సిపల్ రాజకీయాలు

16-02-2026 12:00 AM

చైర్మన్ పీఠంపై నరాలు తెగే ఉత్కంఠ

అనైతిక ఒప్పందానికి తెరలేపిన రాజకీయ పార్టీలు

నేడు చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నిక

ఆదిలాబాద్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల రాజకీయాలు ఆదిలాబాద్ లో రసవత్తరంగా మారాయి. చైర్మన్ పీఠం ఎన్నిక పై రాజకీయ నేతల్ల, ప్రజల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వకపోవడంతో ఆయా రాజకీయ పార్టీలు చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల నుండి గెలిచిన అభ్యర్థులను నేతలు క్యాంపులకు తరలించి మంతనాలు జరుపుతున్నారు.

ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఇండిపెండెంట్ లు కీలక పాత్ర పో షించానున్నారు. మున్సిపాలిటీలో మొత్తం 49 వార్డులు ఉండగా, ఎక్సఫిషియో సభ్యులు ఎంపీ, ఎమ్మెల్యే లతో కలుపుకొని 51 స్థానాలకు చేరింది. ఇందులో 26 మంది సభ్యుల మద్దతు ఉన్నవారు చైర్మన్ పీఠాన్ని దక్కించుకోగలుగుతారు. దీని కోసం ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బేర సారాలు కొనసాగిస్తున్నారు.

ఎన్నికల్లో బీజేపీ 21 వార్డుల్లో, కాంగ్రెస్ 11 వార్డుల్లో, బీఆర్‌ఎస్, ఎం.ఐ.ఎం చరో 6 వార్డులను గెలుచుకున్నారు. 5 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలి చారు. బీజేపీకి 21 వార్డులతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతుతో 23 కు చేరుకుంది. దీంతో వీరికి మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థుల మద్దతు అవసరం. ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థులతో మంతనాలు కొనసాగిస్తున్నారు. స్వయంగా ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థుల ఇళ్లలోకి వెళ్లి వారిని కలిసి వైస్ చైర్మన్ పదవితో పాటు ఇతర ఆఫర్లను ఇచ్చినట్లు సమాచారం. 

చైర్మన్ పీఠంపై కన్నేసిన కాంగ్రెస్...

అటు ఎలాగైయిన కాంగ్రెస్ చైర్మన్ పీఠా న్ని దక్కించుకునేందుకు శతవిధాల కృషి చేస్తోంది. పార్టీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, నియోజకవర్గ ఇంచార్జీ కంది శ్రీనివాస్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థులతో మంతనాలు జరిపారు. రాజకీయాల్లో బద్ధ శత్రువులైన బీఆర్ ఎస్, కాంగ్రెస్ నేతలు చైర్మన్ పీఠం కోసం ఒక్కటై అనైతిక పొత్తుకు సిద్ధమవుతున్నారు. స్వత్రంతులకు చైర్మన్ పీఠం అఫర్ తో పాటు ఇతరత్ర తైలాలు ఇచ్చేందుకు సిద్ధం అయినట్లు సమాచారం.

ఐతే కాంగ్రెస్ అభ్యర్థులు చైర్మన్ పీఠం కోసం పట్టు పట్టడంతో సొంత పార్టీలోనే వ్యతిరేకత నెలకొన్నట్లు సమాచారం. అటు బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షు లు, మాజీమంత్రి జోగు రామన్నతో, ఎం.ఐ. ఎం పెద్దలతో కాంగ్రెస్ పార్టీ నేతలు మంతనాలు జరిపి మద్దతు కోరినట్లు తెలిసింది. మొత్తానికి ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతోందానే ఉత్కంఠ ఆయా పార్టీల నేతలతో నెలకొంది.