calender_icon.png 3 July, 2025 | 9:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్ సౌకర్యం కల్పించాలంటూ విజ్ఞప్తి

02-07-2025 08:26:43 PM

మణికొండ: మణికొండలోని కాలనీల నుంచి పలు ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించాలంటూ అన్ని కాలనీల ప్రతినిధుల సంఘ నాయకులు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్(RTC MD VC Sajjanar)ను కలిసి వినతి పత్రం సమర్పించారు. అల్కాపురి టౌన్ షిప్ కు బస్ సౌకర్యం కల్పించాలని, అలాగే మణికొండ నుంచి ఎయిర్ పోర్ట్ కు, రాయదుర్గం మెట్రో స్టేషన్ కు, కూకట్ పల్లి, కాచిగూడ, సికింద్రబాద్ రైల్వే స్టేషన్ కు బస్ లు ఏర్పాటు చేయాలని ఈ వినతి పత్రంలో కాలనీల ప్రతినిధులు కోరారు. కాలనీల ప్రతినిధుల విజ్ఞప్తికి సజ్జనార్ సానుకూలంగా స్పందించారు. ఈ రూట్స్ లో బస్ సౌకర్యం ఎంత అవసరమో తెలుసుకునేందుకు ఓ టీమ్ ను ఏర్పాటు చేస్తామని సజ్జనార్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కాలనీల ప్రతినిధుల సంఘం ఉపాధ్యక్షుడు ఎస్ రాజశేఖర్, ఈసీ మెంబర్స్ అవినాష్, మహేంద్ర చారి, మణికొండ వాస్తవ్యులు చలమరెడ్డి పాల్గొన్నారు.