02-07-2025 08:29:48 PM
నల్గొండ జిల్లా క్రిస్టియన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రేఖల భద్రాద్రి..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): నామినేటెడ్ పోస్టులలో క్రిస్టియన్లకు ప్రాధాన్యత కల్పించాలని కోరుతూ ఉమ్మడి నల్గొండ జిల్లా క్రిస్టియన్ అసోసియేషన్(District Christian Association) జిల్లా అధ్యక్షుడు రేఖల భద్రాద్రి ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి అడ్డూరి లక్ష్మణ్(District In-charge Minister Adluri Lakshman)తో పాటు రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venkata Reddy)కి వినతిపత్రం అందజేశారు. క్రిస్టియన్లు కాంగ్రెస్ కు ఎల్లవేళలా అండగా ఉంటున్నారని తెలిపారు. గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు అండగా ఉండి గెలిపించడంలో క్రియాశీలక పాత్ర పోషించడం జరిగిందని తెలిపారు.
గత ప్రభుత్వంలో కూడా క్రిస్టియన్లకు ఎమ్మెల్సీతో పాటు పలు నామినేటెడ్ పోస్టులను ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులు క్రిస్టియన్లకు ప్రాధాన్యత కల్పించి రెండు కార్పొరేషన్ పదవులు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా జిల్లాలోని క్రైస్తవులకు సమాధులు, చర్చిల నిర్మాణానికి తగిన స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సమాధులకు సంబంధించి స్థలం లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వివరించారు. ఇప్పటికైనా క్రిస్టియన్ల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో టీఎస్ క్రిస్టోఫర్, ఎస్పీ జయప్రకాష్, కట్ట మోజేష్, బిషప్ సమర్పణ కుమార్, ఇసాక్, ఆశయ్య, ప్రవీణ్, నతనియన్ తదితరులు పాల్గొన్నారు.