24-12-2025 12:08:54 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2026–27 విద్యాసంవత్సరానికి గాను 5వ తరగతి, 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం అర్హత కలిగిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ గురుకులాల సమన్వయ అధికారి జూలూరు యాదగిరి తెలిపారు.
ఈ మేరకు 11-12-2025 నుండి 21-01-2026 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఒక్క ఫోన్ నంబర్‌తో ఒక్క దరఖాస్తు మాత్రమే చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష 22-02-2026 న ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు జిల్లాలో ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాలలో నిర్వహించబడుతుందని తెలిపారు. ఇతర సమాచారం కోసం క్రింది వెబ్‌సైట్లను సందర్శించాలని కోరారు: https://tgswreis.telangana.gov.in , https://tgcet.cgg.gov.in