24-12-2025 12:07:24 PM
ఒక బస్తా యురియా కోసం
మరిపెడ సొసైటీ వద్ద బారులు తీరిన రైతులు
మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో ఒక బస్తా యూరియా కోసం మళ్లీ మొదలైన రైతుల(Farmers) కష్టాలు. మరిపెడ మండల ప్రాథమిక సహకార కేంద్రం సొసైటీ వద్ద యూరియా బస్తాలు ఇస్తున్నారన్న సమాచారంతో బుధవారం తెల్లవారుజామున నుంచి రైతులు యూరియా కోసం క్యూ లైన్ లో బారులు తీరారు. గత వానాకాలం సీజన్ నుంచి మొదలైన కష్టాలు ఇప్పుడు వరకు కొనసాగుతూనే ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం యురియా చెల్లించకపోవడం క్యూలైన్లో నిలుచున్న కొంతమంది రైతులకు యురియా దొరకక అసంతృప్తితో వెనుతిరిగి వెళ్లడం జరిగింది.