24-12-2025 12:29:50 PM
నేను కాంగ్రెస్ లోనే ఉన్నా.
నేను ఏ పార్టీలో ఉంటే, ఆ పార్టీ గెలుస్తుంది.
హైదరాబాద్ మరింత అభివృద్ధి .
హైదరాబాద్: మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Khairatabad MLA Danam Nagender) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని ఎమ్మెల్యే దానం స్పష్టం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదని పేర్కొన్నారు. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందని దానం నాగేందర్ తెలిపారు.
జీహెచ్ఎంసీలో కాంగ్రెస్, ఎంఐఎం మొత్తం 300 డివిజన్లు గెలుస్తాయని వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad) అంతటా ప్రచారం చేస్తా.. జీహెచ్ఎంసీ అంతటా తిరిగి కాంగ్రెస్ పథకాలను(Congress schemes) వివరిస్తానని దానం పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ విస్తరణతో హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతోందన్నారు. దానం నాగేందర్ రాజీనామా బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. స్పీకర్ విచారణ జరుగుతున్న సమయంలో దానం వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ ఫిరాయింపుపై ఇప్పటి వరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు దానం వివరణ ఇవ్వలేదు. మొత్తానికి దానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఉత్కంఠ నెలకొంది.