13 May, 2026 | 7:41 PM

​బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌లో ప్రవేశం కొరకు దరఖాస్తుల ఆహ్వానం

13-05-2026 07:09 PM

​జూన్ 10న లాటరీ పద్ధతి ద్వారా విద్యార్థుల ఎంపిక

​1వ, 5వ తరగతుల్లో ప్రవేశం కొరకు జిల్లాలోని ఎస్సీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

​పెద్దపల్లి,(విజయ క్రాంతి): ​2026-27 విద్యా సంవత్సరానికి గాను పెద్దపల్లి జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ (రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్) పాఠశాలల్లో 1వ తరగతి, 5వ తరగతుల్లో ప్రవేశం కొరకు జిల్లాకు చెందిన అర్హులైన షెడ్యూల్డ్ కులాల  విద్యార్థినీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ​బెస్ట్ అవైలబుల్ స్కూల్ నందు 1వ తరగతి (నాన్ రెసిడెన్షియల్) లో 70 సీట్లు, 5వ తరగతి (రెసిడెన్షియల్) లో 73 సీట్లు కేటాయించడం జరిగిందని ఆయన వివరించారు.

​​కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1,50,000/- లోపు, పట్టణ ప్రాంతాల వారికి రూ. 2,00,000/- లోపు ఉండాలని, ​1వ తరగతి నాన్ రెసిడెన్షియల్ ప్రవేశం కోరే విద్యార్థులు 01.06.2019 నుండి 31.05.2020 మధ్య జన్మించి ఉండాలి, ​ఒక కుటుంబం నుండి ఒకరికి మాత్రమే ప్రవేశానికి అర్హత ఉంటుందని తెలిపారు. ​ఆసక్తి గల వారు దరఖాస్తు ఫారాలను మే 16 నుండి జూన్ 05 వరకు జిల్లా కలెక్టర్ కాంప్లెక్స్ లోని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయం నుండి పొందవచ్చును.

పూర్తి చేసిన దరఖాస్తులను తగిన ధ్రువీకరణ పత్రాలతో (కులం, ఆదాయం, పుట్టిన తేదీ, ఆధార్ కార్డు మొదలైనవి) జతపరిచి జూన్ 06వ తేదీ సాయంత్రం 5.00 గంటల లోపు అదే కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. ​వచ్చిన దరఖాస్తుల నుండి జూన్ 10న లాటరీ పద్ధతి ద్వారా సీట్ల కేటాయింపు నిబంధనల ప్రకారం ఎంపిక ప్రక్రియ జరుగుతుందని, ఇతర వివరాల కొరకు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయంలో లేదా ఫోన్ నెంబర్లు 9618844454, 9989354155 నందు సంప్రదించవచ్చని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.