రాజీవ్ గాంధీకి ఘన నివాళులు
21-08-2026 01:50 AM
రామచంద్రపురం, ఆగస్టు 20: రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని రామచంద్రారెడ్డి నగర్ కాలనీ గెస్ట్హౌస్ వద్ద ఉన్న మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహానికి తాజా మాజీ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నగేష్ ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నవభారత నిర్మాణానికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ సతీష్ గౌడ్, మవిన్ గౌడ్, నాగేష్, పీటర్, శాంతమ్మ, నగేష్, శివ, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.






