calender_icon.png 1 May, 2025 | 7:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్తీ దవాఖానల డాక్టర్ పోస్టులకు దరఖాస్తులు

29-04-2025 01:07:42 AM

యాదాద్రి భువనగిరి ఏప్రిల్ 28 ( విజయ క్రాంతి ): యాదాద్రి భువనగిరి జిల్లాలో 04 బస్తీ దవాఖానాలందు వైద్యాధికారుల పోస్టులకు దరఖాస్తులు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మనోహర్ తెలిపారు.  ఎంబీబీఎస్ అర్హత కలిగి కాంట్రాక్ట్ పద్దితిలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటి ద్వారా నియామకం చేయనున్నందున  అర్హత కలిగిన అభ్యర్దులు దరఖాస్తు చేసు కోవాలన్నారు.  సమద్ చౌరస్తా , జగదేవపూర్ గడ్డ ,  హనుమాన్ వాడ పోస్తులు భువనగిరి జిల్లా కేంద్రంలో కాగా, మరొక బస్తి దవాఖాన  చౌటుప్పల్ లో ఉందన్నారు.

దరఖాస్తులను  తేది:29-04-2025 నుండి 01-05-2025 వరకు స్వీకరించనున్నామని, ప్రొవిజినల్ మెరిట్ లిస్టు ప్రదర్శన ( పరిశీలనకు మరియు ఆక్షేపణలు, అభ్యంతరముల స్వికరణకు): తేది: 06-05-2025 నుండి 07-05-2025 వరకు ఉంటుందన్నారు. ఫైనల్ మెరిట్ లిస్టును తేది: 12-05-2025 ప్రదర్శనకు ఉంచుతామన్నారు. సర్టిఫికేట్ ల పరిశీలన కౌన్సిలింగ్, అప్పాయింట్మెంట్ ఆర్డర్ కొరకు తేది: 14.05.2025 న చేపడతామని వివరించారు.