01-05-2025 01:31:02 AM
హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖకు తదుపరి బాస్ ఎవరు? అనే చర్చ మొదలైంది. ఈ ఏడాది సెప్టెంబర్ 6వ తేదీతో డీజీపీ డా.జితేందర్ పదవీకాలం ముగుస్తుండటంతో ఆయన తర్వాత ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
దీని కోసం ప్రభు త్వం తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 7 మంది ఐపీఎస్ అధికారులతో ప్యానెల్ లిస్ట్‌ను సిద్ధం చేసినట్టు సమాచారం. జాబితాను యూపీఎస్సీకి సిఫారసు చేసిందని తెలుస్తోంది. ఈ లిస్ట్ నుంచి యూపీఎస్సీ ముగ్గురు అధికారుల పేర్లను సిఫారసు చేస్తుంది.
వారిలో ఒకరిని రాష్ర్ట ప్రభుత్వం డీజీపీగా నియమించే అవకాశం ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారుల్లో తెలంగాణకు తర్వాత డీజీపీ ఎవరు కాబోతున్నారనే అంశంపై స్పష్టత వస్తుంది.
రేసులో ఎవరు..
రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన ప్యానెల్ లిస్టులో 1990 బ్యాచ్‌కు చెందిన రవిగుప్తా, 1991బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్, 1994 బ్యాచ్‌కు చెందిన ఆప్టే వినాయక్ ప్రభాకర్, కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, బీ శివధర్‌రెడ్డి, డా. సౌమ్యమిశ్రా, శిఖా గోయల్ ఉన్నట్టు తెలుస్తోంది. కొత్త డీజీపీ నియామకంలో సీనియా రిటీకి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
అయితే రవి గుప్తా, సీవీ ఆనంద్, బీ శివధర్‌రెడ్డి, సౌమ్యమిశ్రా పేర్లు ప్రముఖంగా వినిపిస్తు న్నాయి. రవి గుప్తా ప్రస్తుతం హోం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన గతంలో 2023 డిసెంబర్ నుంచి 2024 జూలై వరకు డీజీపీగా కూడా పనిచేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న శివధర్‌రెడ్డి వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిటైర్ కానున్నారు.
సీవీ ఆనంద్ ప్రస్తుతం హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. సీవీ ఆనంద్ 2028 జూన్‌లో రిటైర్ కానున్నారు. సౌమ్య మిశ్రా, శిఖా గోయల్‌తో పాటు ఏడీజీలు మహేశ్ మురళీధర్ భగవత్, సజ్జనార్, స్టీఫెన్ రవీంద్ర పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
ముగ్గురి సిఫారసు.. ఒక్కరి నియామకం
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ర్ట ప్రభు త్వం డీజీ కేడర్‌లోని సీనియర్ ఐపీఎస్ అధికారుల జాబితాను యూపీఎస్సీకి పంపా ల్సి ఉంటుంది. యూపీఎస్సీ ముగ్గు రు అధికారుల ప్యానెల్‌ను సిఫారసు చేస్తుం ది. వారిలో ఒకరిని డీజీపీగా నియమించాలి. డీజీపీగా నియమితులయ్యే అధికారికి కనీ సం 30 ఏళ్ల సర్వీసు ఉండాలి. డీజీ లేదా ఏడీజీ ర్యాంక్ కలిగి ఉండాలి. కనీసం ఆరు నెలల సర్వీసు మిగిలి ఉండాలి.
డీజీపీల నియామకంపై సుప్రీంకోర్టు ఈ ఏడాది జనవరిలో ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ సూ ర్యకాంత్, జస్టిస్ దీపాంకర్‌దత్తా, జస్టిస్ ఉజ్జల్‌భుయాన్‌తో కూడిన బెంచ్ కీలక తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణకు డీజీపీగా ఉన్న జితేందర్ పదవీ కాలం సెప్టెంబర్ 6న ముగుస్తుంది.
అందులో భా గంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త డీజీపీ నియామకానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచా రం. రవిగుప్తా, బీ శివధర్‌రెడ్డిలతో పోలిస్తే సీవీ ఆనంద్, ఆప్టే వినాయక్ ప్రభాకర్, సౌమ్య మిశ్రా, శిఖా గోయల్‌లకు ఎక్కు వ పదవీ కాలం ఉండటంతో రాష్ట్ర ప్రభు త్వం ఎవరిని తెలంగాణ కు కొత్త డీజీపీగా నియమిస్తుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.