calender_icon.png 1 May, 2025 | 8:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌కు పదేళ్ల అధికారం పగటి కల

01-05-2025 01:57:28 AM

  1. సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నా..
  2. ఏ పథకంపైనైనా చర్చకు సిద్ధం
  3. బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ చూసి సీఎంకు కలవరం
  4. మాజీ మంత్రి తన్నీరు హారీశ్‌రావు

హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): కాంగ్రెస్‌కు పదేళ్ల అధికారం పగటి కలేనని, ముందు రేవంత్‌రెడ్డి తన సీఎం కుర్చీని ఎవరూ తీసుకోకుండా చూసుకోవాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఎద్దే వా చేశారు. బుధవారం ఆయన ‘ఎక్స్’లో ఆయన స్పందిస్తూ.. సీఎం విసిరిన సవాల్‌కు తాను సిద్ధమని, కాళేశ్వరం, రుణమాఫీ, రైతుబంధు, ఉద్యోగాల భర్తీపై ఎలాంటి చర్చకైనా తాను సిద్ధమని ప్రకటించారు.

గతంలో తాను రుణమాఫీపై చర్చకు రావాలని సీఎం కు సవాల్ విసిరానని, దానిపై చర్చకు రాలేక సీఎం ముఖం చాటేశారని దుయ్యబట్టారు. పదో తరగతి పరీక్షా ఫలితాలను సైతం సీఎం తన రాజకీయ అవసరాలకు వాడుకోవడం సిగ్గుచేటన్నారు. సీఎం స్థాయిలో ఉండి కూ డా రేవంత్‌రెడ్డి తన హోదాను మరచిపోయి, దిగజారుడు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.

బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ చూసినప్పటి నుంచి సీఎంలో కలవరపాటు మొదలైందని, అం దుకే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆ ర్ సభలో పేర్కొన్నట్లు కాంగ్రెస్ అప్పటికీ, ఇప్పటికీ తెలంగాణకు విలనే నని ఉద్ఘాటించారు. జపా న్ పర్యటనకు వెళ్లి వచ్చిన నాటి నుంచి సీ ఎంకు మతిస్థిమితం తప్పిందని, బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు వచ్చిన జనాదరణ చూసి మతి పూర్తిగా చలించిం దన్నారు.

బీఆర్‌ఎస్ హయాంలో అమలైన ఏ పథకమూ ఆగలేదని సీఎం చెప్తున్నారని, మరి కేసీఆర్ కిట్, దళితబంధు, గొర్రెల పంపిణీ పథకాలు ఎం దుకు ఆగిపోయాయో సీఎం సమధానం చెప్పాలని నిలదీశారు. పింఛన్లు, ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయి లు ఎందుకు పెండింగ్‌లో ఉంటున్నా యో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

ఆరు గ్యారంటీలు, 420 హామీలుగా నే మిగిలిపోయాయని ధ్వజమెత్తారు. ఏడాదిలో 2.5 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెం డర్, విద్యార్థులకు విద్యా భరోసా కార్డు, విద్యార్థినులకు స్కూటీలు, మహిళలకు నెలకు రూ.2,500 పథకాలు ఏమయ్యాయ ని ప్రశ్నించారు.

రైతులకు రూ.15 వేల పెట్టుబడి సాయం ఏమైందని నిలదీశారు. కౌలు రైతులకు రూ.15 వేల చొప్పున పెట్టుబడి సా యం అందిస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు. సీఎం శిశుపాలుడిలా తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్తున్నారని, సీఎంకు ప్రజలు బుద్ధి చెప్పేరోజు వస్తుందన్నారు.