25-06-2025 07:42:59 PM
దౌల్తాబాద్: రాయపోల్ మండల కేంద్రంలోనీ కేజీబీవీ పాఠశాల(KGBV School)లో అటెండర్, డే వాచ్ ఉమెన్, హెడ్ కుక్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మండల విద్య అధికారి సత్యనారాయణ రెడ్డి(Mandal Education Officer Satyanarayana Reddy) ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాయపోల్ కేజీబీవీ పాఠశాలలో పోస్టులకు దరఖాస్తులను చేసుకోవడానికి తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసేందుకు స్థానికులైన మహిళలు కావాలని పేర్కొన్నారు.
హెడ్ కుక్ పోస్ట్ కి ఏడవ తరగతి చదివి, 300 మందికి వంట చేయగల సామర్థ్యం కలిగి ఉండాలని తెలిపారు. అలాగే డే వాచ్ ఉమెన్, అటెండర్ పోస్టుకు పదవ తరగతి చదివిన వారు అర్హులని తెలిపారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి నేటి నుండి వచ్చేనెల మూడవ తేదీ వరకు దరఖాస్తులను పాఠశాల కార్యాలయంలో తీసుకోవడం జరుగుతుందన్నారు. కావున అర్హులైన మహిళలు వెంటనే దరఖాస్తు చేసుకోగలరని ఆయన తెలిపారు. తదనంతరం ఇంటర్వ్యూ, డెమో నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.