11 August, 2026 | 1:57 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

గీత దాటొద్దు.!

25-06-2025 07:39 PM

పార్కింగ్ కోసం ప్రత్యేక మార్కింగ్..

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేంద్రం నడిబొడ్డున అడ్డదిడ్డంగా వాహనాల పార్కింగ్ అంశంపై పట్టణ సీఐ మహేందర్ రెడ్డి(CI Mahender Reddy) ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల పట్టణ సీఐగా బాధ్యతలు చేపట్టిన మహేందర్ రెడ్డి ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. నెహ్రు సెంటర్ వద్ద నడిరోడ్డుపై ఇంతకాలం ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసే పరిస్థితి ఉండగా, ఆ పద్ధతిని పూర్తిగా తొలగించారు. రోడ్డును క్లియర్ చేయడంతో ఇప్పుడు రైల్వే స్టేషన్ కు వెళ్లే వాహనదారులు, ప్రయాణికులకు ఇబ్బంది తొలగిపోయింది. అలాగే జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆదేశాల మేరకు నెహ్రూ సెంటర్ వద్ద వాహనాలను షాపుల యజమానులు, ఇతరులు రోడ్డు మీద పార్కు చేయకుండా ప్రత్యేకంగా  మార్కింగ్ ఇచ్చి, తెలుపు రంగుతో నో పార్కింగ్ అంటూ రాయించారు. సర్కిల్ దాటి రోడ్డుపై వాహనాలను పార్కింగ్ చేస్తే  జరిమానా విధిస్తామని సిఐ తెలిపారు.