28-12-2025 01:32:23 PM
మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో యువ పురస్కార్ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మంచిర్యాల పట్టణ సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, యువజన అవార్డు గ్రహీత వలస సుభాష్ చంద్రబోస్ ఆదివారం తెలిపారు. యువజన సంఘాలకు, మహిళా సంఘాలకు రాష్ట్రస్థాయి సంకల్ప యువ పురస్కారం అవార్డుల ప్రధాన ఉత్సవ కార్యక్రమం హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
యువజన, మహిళ సంఘాల ద్వారా వారు చేసిన సామాజిక, సేవ రంగాలలో ప్రతిభ కలిగిన వారికి రాష్ట్రస్థాయి సంకల్ప యువ పురస్కార్ అవార్డులు ప్రధానం చేస్తున్నట్లు వెల్లడించారు. జనవరి 15 లోపు వారు చేసిన సామాజిక, సేవా కార్యక్రమాల ఫోటోలు, ప్రెస్ క్లిప్పింగులు, వారికి వచ్చిన మెరిట్ సర్టిఫికెట్లు దరఖాస్తుకు జత చేసి పోస్ట్ ద్వారా పంపించాలని సామాజిక సేవారంగంలో ప్రతిభగల యువజన సంఘాలను మహిళా సంఘాలను కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు వలస సుభాష్ చంద్ర బోస్, వ్యవస్థాపక అధ్యక్షులు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ, ఇంటి నెంబర్ 2-92, సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెల్ల గ్రామం, పిన్ 505473కి పంపించాలని కోరారు.