28-12-2025 01:29:29 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): శ్రీ హరి హర పుత్ర స్వామి మాల ధారణ చేసిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి కలియుగ వైకుంఠం శబరిమల యాత్రను పూర్తి చేరుకున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి – సోనే రావు దంపతులు ఆదివారం స్థానిక అయ్యప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మండల దీక్ష పూర్తి చేసుకున్న వారు మాల విరమణ చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు గురుస్వామి నాగేశ్వర్ శర్మ వారికి మాల విరమణ చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... అయ్యప్ప కృపతో ఆసిఫాబాద్ నియోజకవర్గం సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ ఆరోగ్యం, శాంతి, సమృద్ధి కలగాలని ప్రార్థించినట్లు తెలిపారు.