calender_icon.png 28 December, 2025 | 3:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ పోలింగ్

28-12-2025 02:03:59 PM

హైదరాబాద్: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆదివారం ఉదయం ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకూ కొనసాగింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుందని, సాయంత్రం 6 గంటల వరకు ఫలితాలను వెల్లడించనున్నట్లు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల అధికారులు తెలిపారు. 

మన ప్యానెల్ పేరిట చిన్న నిర్మాతలు, ప్రోగ్రెసివ్ ప్యానల్ పేరుతో పెద్ద నిర్మాతలు పోటీ చేశారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో 3,355 మంది సభ్యులు ఉన్న ఫిల్మ్ ఛాంబర్ కు అధ్యక్ష, కార్యదర్శులతో పాటు 12 మంది ఎగ్జిక్యూటివ్ సభ్యులకు ఇవాళ ఎన్నికల జరిగాయి. ఈ ఎన్నకల్లో గెలుపొందిన నూతన కార్యవర్గం సభ్యులు 2027 వరకు కొనసాగుతారు.