28-12-2025 01:45:07 PM
హైదరాబాద్: అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను గాంధీ భవన్ లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకల్లో మంత్రులు, నేతలు పాల్గొని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జెండాను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎగురవేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ప్రధానులు తెచ్చిన సంస్కరణల వల్లే దేశం ముందుందని, గాంధీజీ చెప్పిన గ్రామ స్వరాజ్యం స్ఫూర్తిగా నరేగాను యూపీఏ ప్రభుత్వం తెచ్చిందని ఆయన పేర్కొన్నారు.