28-12-2025 01:21:49 PM
సిర్పూర్ (యు),(విజయక్రాంతి): మండలంలోని శెట్టి హడ్పునూర్ గ్రామంలో సినీ నటి నిహారిక సందడి చేశారు. పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా గిరిజనులకు దుప్పట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన నిహారికను గ్రామస్థులు మర్యాదపూర్వకంగా పూలు చల్లుతూ ఘనంగా ఆహ్వానించారు. అనంతరం ఆమె మహిళలతో కలిసి ఆదివాసీ నృత్యం చేశారు.
టీవీ, సినిమాల్లో కనిపించే నిహారిక తమ కళ్లముందే సంప్రదాయ కట్టుబొట్టు ధరించి తమతో కలిసి నృత్యం చేయడంతో ఆదివాసీ ప్రజలు ఆనందంతో మురిసిపోయారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ చిత్తరంజన్, సీఐ రమేష్, సిర్పూర్ (యు), కేరమెరి, లింగాపూర్ ఎస్‌ఐలు డి. రామకృష్ణ, మధుకర్, గంగన్న, సర్పంచ్‌లు ఆత్రం విజయలక్ష్మి, సిడం విజయలక్ష్మి, గ్రామ పటేల్ ఆత్రం శ్రీరావు తదితరులు పాల్గొన్నారు.