calender_icon.png 28 December, 2025 | 5:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సినిమాలకు గుడ్ బై

28-12-2025 03:37:06 PM

హైదరాబాద్: టీవీకే అధినేత, కోలీవుడ్ నటుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్లు సీని హీరో విజయ్ ప్రకటించారు.  ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ... తనకు కోటతో సహా సర్వస్వం అందించిన తన అభిమానుల కోసం నిలబడటానికి తాను సినిమాను వదులుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. జనవరిలో విడుదలయ్యే 'జన నాయగన్' చిత్రమే చివరిదని కౌలాలంపుర్ లో జరిగిన సినిమా వేడుకల్లో విజయ్ వెల్లడించారు.

ఇకపై తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు అండగా ఉంటానని ఆయన వ్యాఖ్యానించారు. తాను సినిమా రంగంలోకి అడుగుపెట్టినప్పుడు, ఇక్కడ ఒక చిన్న ఇసుక ఇల్లు కట్టుకుంటుకోవాలనుకున్నాను. కానీ మీరందరూ నాకు ఒక రాజభవనాన్ని నిర్మించారు. అభిమానులు నాకు ఒక కోటను నిర్మించడంలో సహాయపడ్డారు. అందుకే నేను వారి కోసం నిలబడాలని నిర్ణయించుకున్నాను. నా కోసం సర్వస్వం త్యాగం చేసిన అభిమానుల కోసం, నేను సినిమానే వదులుకుంటున్నానని ఆ నటుడు అన్నారు.

తమిళనాడులో, 'కొట్టై' (కోట అని అర్థం) అనే పదం ఒకరి కంచుకోటను సూచించడంతో పాటు, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి రాష్ట్ర శాసనసభ, సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయానికి నిలయంగా ఉన్న బ్రిటిష్ వారిచే నిర్మించబడిన ఫోర్ట్ సెయింట్ జార్జ్‌ను సూచిస్తుంది.