25 August, 2026 | 3:43 AM

25లోపే దరఖాస్తు చేసుకోవాలి

25-08-2026 01:06 AM

నాగల్‌గిద్ద, ఆగస్టు 24 : చేయూత పింఛన్లకు అర్హులైన వారు ఈనెల 25వ తేదీలోపే దరఖాస్తు చేసుకోవాలని నాగల్గిద్ద మండల ఎంపీడీవో మహేశ్వరరావు సూచించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, చేతి కార్మికులు, తలసేమియా, సికిల్సెల్ డిసీజ్, హెమోఫీలియా తదితర కేటగిరీల అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 31 వరకు గడువు ఉన్నప్పటికీ చివరి వరకు వేచి ఉండకుండా 25లోపే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. చివరి రోజుల్లో సర్వర్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో మహేశ్వరరావు కోరారు.