మైనారిటీ సంక్షేమ కమిటీ చైర్మన్‌గా జుక్కల్ ఎమ్మెల్యే తోట
25-08-2026 01:06 AM
జుక్కల్, ఆగస్టు 24 (విజయక్రాంతి): జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సోమవారం తెలంగాణ శాసనసభలో మైనారిటీ సంక్షేమ కమిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమం, హక్కుల పరిరక్షణతో పాటు వారి సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని తోట లక్ష్మీకాంతారావు ను శుభాకాంక్షలు తెలియజేశారు.






