14 July, 2026 | 4:50 AM

సత్వరం పరిష్కరించాలి

14-07-2026 01:29 AM

ట్రై సైకిళ్లను సద్వినియోగం చేసుకోండి 

జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా

మహబూబ్ నగర్, జూలై 13 (విజయక్రాంతి): ప్రజా ఫిర్యాదులను సత్వరమే పురస్కరించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి హరిప్రియతో కలిసి అర్జిదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా అర్జిదారుల సమస్యలను సావధానంగా విన్నారు. ప్రతి సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వారికి భరోసా ఇచ్చారు.

అధికారులు ప్రజావాణి దరఖాస్తులను క్షుణ్ణంగా చదివి అర్థంచేసుకుని క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. సర్ ప్రక్రియను వేగవంతం చేయాలని, రెడ్ క్రాస్ నందు రూ 250 చెల్లించి సభ్యత్వం ప్రతి అధికారి తీసుకోవాలని సూచించారు. వాహన చోదకులు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని ఆదేశించారు.

ప్రజావాణి కి 112 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. అనంతరకు ఎలక్ట్రిక్ తో కూడిన ట్రైసైకిళ్లు 7,  బ్యాటరీ ఆపరేటెడ్ వీల్ చైర్లు 9, ఉపకరణములు వికలాంగులకు జిల్లా కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనీ ,భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రామ్ రెడ్డి, డి.ఆర్.ఓ ఎ .నిర్మల, జడ్.పి.సి.ఈ.ఓ, ఇన్.ఛార్జ్ డి.పి.ఓ వెంకట రెడ్డి, డి.ఆర్.డి.ఓ నరసింహులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.