calender_icon.png 11 July, 2025 | 3:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండపోచమ్మ అభివృద్ధి కమిటీ చైర్మన్ నియామకం

11-07-2025 12:00:00 AM

జగదేవపూర్,జూలై 10: జగదేవపూర్ మండల పరిధిలోని కొండపోచమ్మ  అమ్మవారి ఆలయ అభివృద్ధి చైర్మన్ గా కప్పర అను గీత హరిప్రసాద్ గురువారం కమిటీ సభ్యులతో కలిసి ప్రమాణస్వీకారం చేసి పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా  డిసిసి అధ్యక్షులు తుంకుంటా నర్సారెడ్డి, మాజీ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మెన్ మడుపు భూమ్ రెడ్డి హజరయ్యారు.

ఈ సందర్భంగా  చైర్మన్ అను గీత హరిప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం తరుపున మంత్రులతో, టీ టీ డీ వారి సహకారంతో, దాతల సమన్వయంతో చర్చలు జరిపి త్వరలోనే దేవాలయ అభివృద్ధి పనులు మొదలు పెడుతమని అన్నారు. అమ్మవారికి సేవ చేయడానికి అవకాశం కల్పించారు అని పేర్కొన్నారు.రానున్న కాలంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అభివృద్ధి చేస్తాం అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి,దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ విజయ లక్ష్మి,ఈ ఓ రవికుమార్,రాష్ట్ర జర్నలిస్టు యూనియన్ నాయకులు కప్పారా ప్రసాద్,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి,తాజా మాజీ సర్పంచ్  కప్పార భాను ప్రకాష్,రజిత రమేష్,కొండపొచ్చమ్మ డైరెక్టర్లు నరేష్,ఆశయ్య, వెంకట్ రెడ్డి, ఆలయ అర్చకులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.