calender_icon.png 11 July, 2025 | 8:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూర్యాపేట జిల్లాలో మంత్రి ఉత్తమ్ పర్యటన..

10-07-2025 11:35:47 PM

కోదాడ హుజూర్ నగర్ నియోజక వర్గాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి ఉత్తమ్..

హుజూర్ నగర్: రేపు సూర్యాపేట జిల్లాలోని కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గలలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర సివిల్ సప్లై, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్(Minister Uttam Kumar Reddy) శంకుస్థాపన చేయనున్నారని మంత్రి కార్యాలయ పిఆర్వో వెంకటరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

మంత్రి ఉత్తమ్ పర్యటన వివరాలు... 

ఈనెల 14న తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో జరుగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ ఏర్పాట్ల పరిశీలన అనంతరం కోదాడ నియోజక వర్గంలోని మోతె మండలంలోని మామిళ్ళ గూడెం సుమంగళి ఫంక్షన్ హాల్ లో రూ.244 కోట్లతో 45,736 ఎకరాలకు సాగు నీరు అందించేందుకు నిర్మాణం చేపట్టే మోతె ఎత్తిపోతల పధకంపై సమీక్ష సమావేశం, కోదాడ పట్టణంలో రూ 5.10 కోట్లతో నీటిపారుదల శాఖ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన, చిలుకూరు మండలంలోని జెర్రిపోతుల గూడెం గ్రామంలో రూ 8 కోట్లతో బేతవోలు నుండి జెర్రిపోతుల గూడెం వరకు ఆర్ అండ్ బిటి రోడ్డు పనులకు శంకుస్థాపన అనంతరం హుజూర్ నగర్ నియోజక వర్గంలోని వేపలసింగారం గ్రామంలో రూ. 2.31 కోట్లతో వేపల సింగారం నుండి కందిబండ వరకు పంచాయతీరాజ్ బిటి రోడ్డుకు శంకుస్థాపన, హుజూర్ నగర్ మండల పరిధిలో లక్కవరం గ్రామంలో రూ 2.20 కోట్లతో లక్కవరం నుండి మగ్దుంనగర్ వరకు పంచాయతీరాజ్ బిటి రోడ్డుకు శంకుస్థాపన, హుజూర్ నగర్  ప్రభుత్వ ఆసుపత్రిలో ఔట్ పేషెంట్ బ్లాక్  నూతన భవనంకు శంఖుస్థాపన, రక్తనిది కేంద్రం ప్రారంభోత్సవం, హుజూర్ నగర్  విద్యుత్ డివిజనల్ కార్యాలయం ఎదుట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహా విష్కరణ, హుజూర్ నగర్ పట్టణంలో రూ7.99 కోట్లతో నీటిపారుదల శాఖ కార్యాలయ భవనంకు శంకుస్థాపన, గరిడేపల్లి మండలం, పొనుగోడు గ్రామంలో రూ 50 లక్షలతో పొనుగోడు పాత బస్ స్టాండ్ నుండి  మెయిన్ రోడ్డు వరకు  పంచాయతీరాజ్ బిటి రోడ్డుకు శంకుస్థాపన, రూ 3.15 కోట్లతో పొనుగోడు నుండి అప్పన్నపేట వరకు పంచాయతీరాజ్ బిటి రోడ్డుకు శంకుస్థాపన, గరిడేపల్లి మండలం, గానుగబండ గ్రామంలో రూ.3.50 కోట్లతో గానుగబండ నుండి హనుమంతుల గూడెం వరకు పంచాయతీరాజ్ బిటి రోడ్డుకు శంకుస్థాపన, రూ 1.40 కోట్లతో గానుగబండ హై స్కూల్ నుండి పరెడ్డి గూడెం వరకు పంచాయతీరాజ్ బిటి రోడ్డుకు శంకుస్థాపన, గరిడేపల్లి మండలం, కల్మల్ చెరువులో రూ 3.50 కోట్లతో కల్మల్ చెర్వు ఆర్అండ్ బి రోడ్డు నుండి బొత్తలపాలెం ఆర్అండ్ బి రోడ్డు  వరకు పంచాయతీరాజ్ బిటిరోడ్డుకు శంకుస్థాపన, రూ 2.80 కోట్లతో కల్మల్ చెరువు నుండి గానుగబండ వరకు పంచాయతీరాజ్ బిటి రోడ్డుకు శంకుస్థాపన, రూ 3.50 కోట్లతో కల్మల్ చెరువు నుండి దిర్శించర్ల వరకు పంచాయతీరాజ్ బిటిరోడ్డుకు శంకుస్థాపన,రూ 4.20 కోట్లతో కల్మల్ చెరువు ఆర్అండ్ బి రోడ్డు నుండి పాలకవీడు సబ్ స్టేషన్ వరకు పంచాయతీరాజ్ బిటి రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు.