calender_icon.png 11 July, 2025 | 6:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్‌ఓబీ పనులను త్వరగా పూర్తి చేయండి హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

11-07-2025 12:00:00 AM

వరంగల్ (మహబూబాబాద్) జులై 10 (విజయక్రాంతి): త్రినగరిలో ట్రాఫిక్ తిప్పలు! శీర్షికతో వరంగల్ నగరంలోని అసంపూర్తి రైల్వే ఓవర్ బ్రిడ్జి పనుల తీరు, పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలపై ఈనెల 1న విజయ క్రాంతిలో ప్రచురించిన వార్తా కథనానికి అధికారులు స్పందించారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ గురువారం నిర్మాణంలో ఉన్న కాజీపేట ఆర్‌ఓబిని సందర్శించారు.

పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేష్ బాబును పనుల తీరుపై అడిగి తెలుసుకున్నారు. ఆర్‌ఓబి పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనుల్లో జాప్యం తగదని, పనులను వేగవంతం చేసి ఆర్‌ఓబి నిర్మాణాన్ని కంప్లీట్ చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట హన్మకొండ ఆర్డిఓ రాథోడ్ రమేష్,  తాసిల్దార్ బావుసింగ్ తదితరులు ఉన్నారు.