calender_icon.png 27 October, 2025 | 11:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోకుదెబ్బ ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జీల నియామకం

27-10-2025 12:36:25 AM

నిర్మల్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర కమిటీల బలమైన నిర్మాణం చేయడానికి  రాష్ట్ర, జాతీయ కమిటీల నాయ కులను ఒక్కొక్కరిని పాత ఉమ్మడి జిల్లాలకు ఇన్‌చార్జీలుగా నియమించినట్టు రాష్ట్ర అధ్యక్షులు అమరవీరి నర్సాగౌడ్ ఆదివారం వివరాలను వెల్లడించారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సీపతి లింగాగౌడ్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు కొండాపురం బాలరాజ్ గౌడ్, ఉమ్మడి మెదక్ జిల్లాకు రాగుల సిద్ధి రాములు గౌడ్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు బాలసాని సురేష్ గౌడ్, ఉమ్మడి హైదరాబాద్  జిల్లాకు ఏవీ బాలేషం గౌడ్,

ఉమ్మడి నల్లగొండ జిల్లాకు  రాగుల కిరణ్ కుమార్ గౌడ్, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఆనంతుల రమేష్ గౌడ్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు కేసరి ఆంజనేయులు గౌడ్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు ముత్యం నర్సింలు గౌడ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు బుర్ర శ్రీనివాస్ గౌడను నియమించినట్లు ఆయన తెలిపారు.