calender_icon.png 27 October, 2025 | 8:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లను పోరాడి సాధించుకోవాలి

27-10-2025 12:35:41 AM

బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్ 

మంచిర్యాల, అక్టోబర్ 26 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడి సాధించుకుందామని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి అన్నె ల లక్ష్మణ్ అన్నారు. ఆది వారం ఐబీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ జిల్లా అధ్యక్షులు ఎదునూరి రమేష్ తో కలిసి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడానికి 9వ షెడ్యూల్‌లో రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం చేర్చాలని రాజ్యాంగ సవరణ చేయాలని  డిమాండ్ చేశారు.

42 శా తం రిజర్వేషన్ల సాధన సమితి డాక్టర్ విశారదన్ మహారాజ్, మాజీ జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజ ర్వేషన్ల భారీ ఆందోళన కార్యక్రమాలకు సిద్ధం కాబోతున్నామన్నారు. మంచిర్యాల జిల్లాలోనూ ధర్నాలు, రిలే దీక్షలు త్వరలో బీసీ రిజర్వేషన్ల నిరసన కార్యక్రమం చేపడతామన్నారు.

ఉత్పత్తి కులాలైన బీసీలకు తర తరాలుగా అన్యాయం జరుగుతుందని, విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లతో పాటు రాజకీయ రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం ఆగదన్నారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్లపై ఏకమై పోరాటానికి భాగస్వాములై మద్దలివ్వాలని కోరారు. ఈ కార్యక్ర మంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ జిల్లా కార్యదర్శి మంచర్ల సదానందం, జిల్లా నాయకు లు నందిపాటి రాజు, రేగుంట రాకేష్, తాళ్ళపెల్లి చంద్రశేఖర్ పాల్గొన్నారు.