calender_icon.png 28 October, 2025 | 2:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలిక నిశ్చితార్థం అడ్డుకున్న అధికారులు

27-10-2025 12:37:09 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం లోని ఓ కాలనీలో ఆదివారం బాలికకు నిశ్చితార్థం జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారులు, చైల్డ్ హెల్ప్ లైన్ బృందం, పోలీసు సిబ్బంది సమన్వయంతో అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా బాలల సంరక్షణ అధికారి  బూర్ల మహేష్ మాట్లాడుతూ.. మైనర్లకు వివాహం చేయడం చట్ట విరుద్ధం, నేరం అని చెప్పారు. బాలికలకు 18 సంవత్సరాలు, బాలురకు 21 సంవత్సరాలు నిండిన తరువాతే వివాహం చేయాలని సూచించారు. బాల్యవివాహం జరిపితే లక్ష రూపాయల జరిమానా, జైలు శిక్షకు గురవుతారని, వివాహాల్లో పాల్గొన్న పెద్దలు, పురో హితులు, బంధువులు, పెళ్లికుమారుడు, వారి కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఎక్కడైనా బాల్యవివాహం జరగబోతున్నట్లు సమాచారం లభించిన వెంటనే చైల్ హెల్ప్ లైన్ 1098 కి సమాచారం అందించాలని సూచించారు. అనం తరం బాలికను కౌన్సెలింగ్ నిమిత్తం సఖి కేం ద్రానికి తరలించారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్‌వైజర్ ఝాన్సీరాణి, కానిస్టేబుల్ సంతోష్, కాంతమ్మ పాల్గొన్నారు.