18-07-2025 10:11:32 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): పార్లమెంటు ఎన్నికల సమయంలో ఇతర జిల్లాలకు బదిలీ చేసిన ఎంపీడీవోలను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి సొంత జిల్లాకు కేటాయించింది. ఇందులో భాగంగా ఇతర జిల్లాల్లో ఇంతకాలం విధులు నిర్వహించిన ఐదుగురు ఎంపీడీవోలు మహబూబాబాద్ జిల్లాకు తిరిగివచ్చారు. వారికి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తొర్రూరు ఎంపీడీవో గా వెంకటేశ్వర్లు, కొత్తగూడ ఎంపీడీవో గా రోజా రాణి, నెల్లికుదురు ఎంపీడీవోగా కుమార్, దంతాలపల్లి ఎంపీడీవో గా విజయ, మరిపెడ ఎంపీడీవో గా వేణుగోపాల్ రెడ్డి నియమితులయ్యారు. వీరంతా కొత్తగా కేటాయించిన మండలాల్లో బాధ్యతలు చేపట్టారు.