02-09-2025 12:00:00 AM
-గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అంగీకరించిన కాంగ్రెస్ అధిష్ఠానం
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేట్ చేస్తూ పంపిన ప్రతిపాదనకు కాంగ్రెస్ అధిష్ఠానం ఆమోదం తెలిపింది. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరామ్, మాజీ ఎంపీ అజారుద్దీన్ పేర్లను ఏఐసీసీకి తెలంగాణ ప్రభుత్వం పంపించిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సీఎం రేవంత్‌రెడ్డికి తెలిపారు.