calender_icon.png 2 September, 2025 | 4:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ బియ్యం పంపిణీ పునః ప్రారంభం

02-09-2025 11:36:28 AM

అనంతగిరి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకానికి సంబంధించి సెప్టెంబర్ కోటా పంపిణీ ప్రక్రియ ప్రారంభమైందని అనంతగిరి మండల డీలర్ల సంఘం ప్రధాన కార్యదర్శి కోటయ్య అన్నారు మంగళవారం ఆయన మాట్లాడుతూ బియ్యాన్ని సంబంధిత లబ్ధిదారులకు పంపిణీ కేంద్రాల రేషన్ దుకాణాలు ద్వారా అందించేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జూన్ జూలై ఆగస్టు నెలల బియ్యం కోటాను గత జూన్ లోనే ఒకేసారి  పంపిణీ చేశామని తెలిపారు.

దీంతో జులై ,ఆగస్టు మాసాల్లో రేషన్ షాపులలో బియ్యం పంపిణీ జరగలేదన్నారు తాజాగా సెప్టెంబర్ కోటాను సోమవారం నుంచి ఇవ్వడం మొదలుపెట్టామని తెలిపారు. అమీనాబాద్ గ్రామంలో గతంలో కార్డుదారులు 540 ఉండగా ప్రభుత్వం, నూతనంగా 90 రేషన్ కార్డులను మంజూరు చేయడం ద్వారా . గ్రామంలో మొత్తం  కార్డుదారుల సంఖ్య 630  కి చేరిందని అన్నారు. ప్రభుత్వం రేషన్ బియ్యం కోటాను 110 క్వింటాలకు పెంచినట్లు తెలిపారు.కొత్త రేషన్ కార్డు దారులు సైతం ఇదే నెలలో రేషన్ పొందేలా ప్రభుత్వం అవకాశం కల్పించిందనీ కొత్తగా కార్డు లు పొందిన  లబ్ధిదారులు వచ్చి రేషన్ తీసుకోవాలని తెలిపారు వివిధ గ్రామాల్లో రేషన్ డీలర్లు ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో ఎటువంటి లోటు పాటు లు లేకుండా పంపిణీ చేయాలని డీలర్ల సంఘం నాయకులు కోటయ్య కోరారు