02-09-2025 12:17:07 PM
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) కేసీఆర్, హరీశ్ రావు పిటిషన్లపై మంగళవారం నాడు విచారణ జరిగింది. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక(Justice Ghosh Kaleshwaram Commission) ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేపట్టవద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక, సిఫార్సుల మేరకు ఎటువంటి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు ఆదేశించింది. కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao), హరీశ్ రావు మధ్యంతర పిటిషన్లకు విచారణార్హత లేదని, కాళేశ్వరం ఘోష్ కమిషన్ నివేదికపై ఏమైనా చర్యలు తీసుకున్నారా అని చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్(Chief Justice Aparesh Kumar Singh), జస్టిస్ జిఎం మొహియుద్దీన్ లతో కూడిన హైకోర్టు ధర్మాసనం అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నించగా, ఈ అంశాన్ని దర్యాప్తు కోసం సీబీఐకి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన కోర్టుకు తెలిపారు.
అయితే, ఎన్ డిఎస్ఎ నివేదిక, అందుబాటులో ఉన్న ఇతర అంశాల ఆధారంగా సీబీఐ(Central Bureau of Investigation) దర్యాప్తు చేపడుతుందని ఏజీ పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ ఆధారంగా, కమిషన్ నివేదిక చట్టబద్ధతపై కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న విషయం ఆధారంగా, ఎటువంటి ప్రతికూల చర్యలు తీసుకోరాదని కోర్టు ఆదేశించింది. ఈ విషయంపై విచారణను హైకోర్టు అక్టోబర్ 7కు వాయిదా వేసింది. అదే సమయంలో, నివేదికపై స్టే కోరుతూ దాఖలైన ప్రధాన పిటిషన్, మధ్యంతర దరఖాస్తుకు తన సమాధానం దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పీసీ ఘోష్ కమిషన్‌పై ఎంక్వైరీని క్వాష్ చేయాలని అడిగామని, ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగాఎలాంటి చర్యలు వద్దని హైకోర్టు ఆదేశించిందని కేసీఆర్, హరీష్‌రావు తరఫు లాయర్ అర్యమ సుందరం మీడియాకి తెలిపారు.