02-09-2025 11:39:34 AM
నిమజ్జనం ఏర్పాటులో మున్సిపల్ అధికారులు పూర్తి వైఫల్యం
ఏడవ రోజైనా నిమర్జనానికి కేటాయించని స్థలం
లైటింగ్, కర్రలు, మంచినీటి సౌకర్యం కరువు
కోదాడ: గత ఏడాది వినాయకుని నిమజ్జనానికి( Ganesh immersion) మూడవ రోజు నుండే పూర్తిస్థాయిలో కోదాడ పెద్ద చెరువులో సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ ఏడాది వినాయకుని నిమర్జనానికి ఏడవ రోజు అయినప్పటికీ కనీస సౌకర్యాల ఏర్పాట్లు మున్సిపల్ అధికారులు చేయకపోవడంతో నిర్లక్ష్యానికి నిదర్శనమని కమిటీ సభ్యులు పేర్కొంటున్నారు. ఈ సంవత్సరం కోదాడ పట్టణంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విగ్రహాలను భారీ గా ఏర్పాట్లు చేశారు. కానీ గణేష్ కమిటీ వారు ఎక్కడ నిమజ్జనం చేయాలో తర్జనభర్జన చేస్తున్నారు. నిమర్జనం ఎక్కడ చేయాలో కమిటీ వారు ఆలోచనలో పడ్డారు. కోదాడ మున్సిపల్ అధికారులు ముందస్తు ప్రణాళిక లేకపోవడం చెరువు చుట్టూ కర్రలు, లైటింగ్, వాటర్ కనీస సౌకర్యం ఏర్పాటు చేయకపోవడంపై ఉత్సవ కమిటీ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఒకరితగా నిమర్జనానికి పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని కమిటీ సభ్యులు కోరారు..