02-09-2025 10:33:09 AM
న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కు ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్.. కోట్ల మంది హృదయాల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు. ''శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన లెక్కలేనన్ని మంది హృదయాల్లో, మనసుల్లో చెరగని ముద్ర వేశారు. సుపరిపాలనపై దృష్టి సారించడం ద్వారా ఆయన ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏని బలోపేతం చేస్తున్నారు. ఆయన దీర్ఘాయుష్షుతో కూడిన ఆరోగ్యకరమైన జీవితం కోసం ప్రార్థిస్తున్నాను''. అంటూ పీఎం మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. అటు పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగు సూపర్ స్టార్ చిరంజీవి, నటుడు అల్లు అర్జున్ హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవ పట్ల ఆయన అంకితభావం, సామాజిక సున్నితత్వం, పాలన, సినిమా రంగానికి ఆయన చేసిన కృషిని నాయకులు, అభిమానులు ప్రశంసించారు.