02-09-2025 11:46:25 AM
గార్ల,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో యూరియా కొరతపై(Urea Shortage) మంగళవారం రైతులు మెయిన్ రోడ్డుపై బైఠాయించి మహా ధర్నా నిర్వహించారు. రైతుల కష్టాలు మీకు కానరావడం లేదా అంటూ వ్యవసాయ అధికారి రాంజీని నిలదీశారు. సుమారుగా రెండు గంటలపాటు ధర్నా నిర్వహించారు. బయ్యారం ఎస్సై కలగజేసుకొని సాయంత్రం నాలుగు గంటల వరకు యూరియా లోడ్ తెప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పినప్పటికీ రైతులు ఆందోళన విరమించలేదు. యూరియా తెప్పించే వరకు ఆందోళన విరమించేదే లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల మహా ధర్నాకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు గౌని ఐలయ్య, మాజీ జడ్పీ చైర్మన్ బిందు,జగ్గన్న, బిల్లకంటి సూర్యం,ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు.