calender_icon.png 2 September, 2025 | 8:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ బిల్లును ఆమోదించండి

02-09-2025 12:00:00 AM

-గవర్నర్‌కు అఖిలపక్ష నేతల విజ్ఞప్తి 

-రిజర్వేషన్లలో 50 శాతం పరిమితిని ఎత్తివేస్తూ..

-అసెంబ్లీలో చేసిన చట్టాన్ని గవర్నర్‌కు వివరించిన నేతలు 

హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): పంచాయతీరాజ్ చట్టం సవర ణ బిల్లును ఆమోదించాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను అఖిలపక్ష నేతలు కోరా రు. తెలంగాణలో ఉన్న 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ బీసీలకు స్థానిక సంస్థల ఎనికల్లో రిజర్వేషన్లు పెంచుతూ శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని, ఈ మేర కు మూడ్ ఆఫ్ హౌజ్‌ను పరిగణలోకి తీసుకోవాలని గవర్నర్‌ను అఖిలపక్ష నేతలు కోరారు.

సోమవారం పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్,  సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తదితరులు రాజ్‌భవన్‌కు వెళ్లారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌కు సంబంధించిన బిల్లును ఆమోదించాలని కోరా రు. ఈ సందర్భంగా బీసీ జనాభా వివరాలను గవర్నర్ అడిగి తెలుసుకున్నారు.

అనంతరం పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు స్థానిక సంస్థల ఎన్నికల కోసం 50 శాతం రిజర్వేషన్ సీలింగ్ ఎత్తివేస్తూ చట్ట సవరణ చేశా మని తెలిపారు. కులగణన సర్వే ప్రకారం బీసీలకు రిజర్వేషన్ కోసం చట్టం తెచ్చినట్టు చెప్పారు. తెలంగాణలో 56.33 శా తం బీసీల జనాభా ఉందని, బీసీ సం ఘాలు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని పట్టుబడుతున్నాయని వివరించారు. కుల గణన సర్వే నివేదిక దృష్టిలో పెట్టుకుని అఖిలపక్షం గవర్నర్‌ను కలిసి ఆమో దించాలని కోరినట్టు చెప్పారు.