02-09-2025 11:44:20 AM
పట్టించుకోని పంచాయతీ అధికారి..
మునిపల్లి:(విజయక్రాంతి): మునిపల్లి మండలంలోని ఖమ్మం పల్లి గ్రామం(Khammampalli village) లో గత కొన్ని రోజులుగా చెత్త సేకరణ ఆగిపోయింది. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు పంచాయతీ కార్యదర్శికి, అటు గ్రామ స్పెషలాఫీసర్ కు గ్రామస్తులు పలుమార్లు విన్నవించినా.. పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తెలిపారు. ఇదిలా ఉండగా చెత్త విషయమై ఆగస్టు 17న విజయ క్రాంతి దినపత్రికలో ప్రచురితమవడంతో చెత్తను తొలగించారు. మళ్లీ పాత పద్దతే కొనసాగుతున్నదని గ్రామస్తులు వాపోతున్నారు. పంచాయతీకి సంబంధించి చెత్తను ట్రాక్టర్ ను ప్రతి రోజు నడిపితే ఇలాంటి దుస్థితి వచ్చేది కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు గ్రామంలో పేరుకపోయిన చెత్తా చెదారాన్ని తొలగించాలని కోరుతున్నారు.