బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
14-04-2026 05:07 PM
చిట్యాల,(విజయక్రాంతి): డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను బిజెపి పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం చిట్యాల పట్టణ కేంద్రంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.






