షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని గోపాల్పేటలో 20 లక్షలతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు భూమి పూజ చేశారు.ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నాగిరెడ్డిపేట మండలం కేంద్రం గోపాల్పేట్లోని ఎంపీడీవో కార్యాలయం వద్ద సుమారు 20 లక్షల, వ్యాయామంతో నిర్మించనున్న ఆరు గదుల షాపింగ్ కమర్షియల్ కాంప్లెక్స్ కు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అధికారులతో, కాంగ్రెస్ నాయకులతో, కార్యకర్తలతో కలిసి మంగళవారం భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ... ప్రాంతీయంగా చిన్న వ్యాపారులకు వాణిజ్య సదుపాయాలు కల్పించడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం అవుతాయని తెలిపారు. ఈ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయిన అనంతరం స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. అలాగే ఈకార్యక్రమంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే మదన్మోహన్రావు పంపిణీ చేశారు.






