14 April, 2026 | 8:38 PM

రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి

14-04-2026 05:03 PM

మోతె,(విజయక్రాంతి):  రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని తహసీల్దార్ ఎం.వెంకన్న, ఎంపీడీఓ ఆంజనేయులు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలో పాల్గొని వారు మాట్లాడారు. ప్రతి ఒక్కరు అంబేద్కర్ కన్న కలలు నెరవేర్చాలని ఉన్నత లక్ష్యంగా పయనించాలని కోరారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఐ అజయ్ కుమార్, సర్పంచ్ దోసపాటి అనురాధ, పల్లెల పరివర్తన సొసైటీ చైర్మన్ పల్లెల లక్ష్మణ్, ఉప సర్పంచ్ ఉపేందర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి ఆర్ఐ రమేష్, ఏఎస్ఐలు శ్రీ రాములు, మల్లయ్య, వార్డు సభ్యులు వీరబాబు, రాము, తరుణ్, నవీన్, అంజయ్య, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఎల్ఎన్ రాజు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.