పిడుగుపాటుకు ఏఆర్ కానిస్టేబుల్ మృతి
- సీఎం బందోబస్తుకు వెళ్లి తిరిగి వస్తుండగా- ప్రమాదం
- నాగర్‌కర్నూల్ జిల్లా మామిళ్లపల్లిలో ఘటన
నాగర్ కర్నూల్, జూన్ 5 (విజయక్రాం తి): సీఎం బందోబస్తు విధులు ముగించుకొని తిరిగి వస్తుండగా పిడుగుపాటుకు గురై ఏఆర్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిసిన వివరాల మేరకు ఉప్పునుంతల మండలం ఉల్పార గ్రామానికి చెందిన మద్దమల్ల రాజు (2014 బ్యాచ్ ఏఆర్ కానిస్టేబుల్) నాగర్ కర్నూల్ ఆర్మ్‌డ్ రిజర్వ్‌ల్లో వి ధులు నిర్వర్తిస్తున్నాడు.
గత రెండు రోజులుగా సోమశిల వద్ద సీఎం బందోబస్తు విధుల్లో పాల్గొని శుక్రవారం సాయంత్రం తిరుగు ప్రయాణంలో మామిళ్లపల్లి సమీపంలో పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఉప్పునుంతల పోలీసులు మృతదేహాన్ని నాగర్ కర్నూల్ ప్ర భుత్వ ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ మృతి పట్ల పలువురు పోలీసు ఉన్నతాధికారులు విచారం వ్యక్తం చేశారు.






