అయిజలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం
అయిజ జూన్ 5: అయిజలో వ్యవసాయ అనుబంధ రంగాలలో పనిచేస్తున్న కూలీ కార్మికులతో వ్యవసాయ వినియోగదారుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహులు మరియు మేడికొండ గ్రామ సర్పంచ్ లైజమ్మ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ లైజమ్మ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని పెంచడం, పచ్చని చెట్లు నరకడం వల్ల వాతావరణం కాలుష్యం మవుతున్నదని అన్నారు.
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి డంపింగ్ యార్డ్ ని రీసైక్లింగ్ చేసి వాతావరణ కాలుష్యం తగ్గించాలని అన్నారు.జిల్లా కార్యదర్శి నరసింహులు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో వాహనాల వల్ల, చెట్లు నరకడం వల్ల కార్బన్డయాక్సైడ్ విపరీతంగా పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, ఈ విధానం మారాలంటే సేంద్రీయ ఎరువులని ప్రోత్సహించాలని మొక్కలు నాటాలి రిజర్వ్ ఫారెస్ట్ నుండి సంరక్షించాలని అన్నారు.
వాతావరణ కాలుష్యం వల్ల ఓజోన్ పొర దెబ్బతిని నాకు విపరీతమైన ఎండ వేడి వల్ల భూతాపం పెరిగిపోయి వన సంరక్షణ నాశనం అవుతుందని కావున ప్రతి ఒక్కరు మొక్కలు నాటి, మరియు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలని అన్నారు. అనంతరం తహసీల్దార్ జ్యోతికి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో వినోద్, ప్రభాకర్, పద్మ, మల్దకల్ మొదలగు వారు పాల్గొన్నారు.






