calender_icon.png 21 February, 2026 | 5:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల ప్రయోజనాలు పట్టవా!

12-02-2026 12:00:00 AM

కపిలవాయి దిలీప్ కుమార్ :

మన దేశంలో వ్యవసాయం అంటే ప్రకృతితో జూదం లాంటిది. ఆరుగాలం శ్రమించి పంట పండించినా చేతికందుతుందన్న గ్యారెంటీ ఉండదు. అందుకే ప్రభుత్వాలు రైతుల పంటలకు బీమా కల్పించాలి. భారత్‌లో తొలిసారిగా 1985లో పంటల భీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. 

భారతదేశంలో వ్యవసాయరంగం దేశ ఆర్థికాభివృద్ధితో కీలకపా త్ర పోషిస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా సాయం అందిస్తున్నా ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులకు పెట్టుబడి సాగుకయ్యే ఖర్చు, శ్రమను తీసివేస్తే మిగులు తక్కువగానే ఉంటుంది. సకాలంలో వర్షాలు లేకపోవడం, ఉంటే అతివృష్టి లేకుంటే అనావృష్టి, నకిలీ విత్తనాలు, ఎరువుల కొరత, గి ట్టుబాటు ధర లేకపోవడం, చిన్న, సన్నకారు రైతులకు పంటను నిల్వ చేసుకునే వెసులుబాటు లేకపోవడం, దళారీ వ్యవస్థ తదితర కారణాలతో రైతులకు వ్యవసాయం లాభసాటిగా లేదు.

ఈ నేపథ్యంలో అప్పుల్లో కూరుకుపోతున్న రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర పాలకులు, రైతే రాజంటూ సంక్షేమ పథకాలెన్ని తెచ్చినా క్షేత్ర స్థాయి అమల్లో లోపాలుండడం వల్ల రై తులకు న్యాయం జరగడం లేదు. జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో 18 శాతం మాత్ర మే ఉన్న వ్యవసాయరంగం దేశంలోని సగం జనాభాకు ఉపాధి కల్పిస్తోంది.

నకిలీ విత్తనాల బెడద-

భారతదేశంలో మొత్తం 540 ప్రైవేటు వి త్తన కంపెనీలున్నాయి. వాటిలో 80 మాత్ర మే విత్తన పరిశోధన అభివృద్ధి ప్రయోగశాలలను కలిగి ఉన్నాయి. మిగిలిన కంపెనీ లన్నీ ప్రభుత్వ పరిశోధనా సంస్థలు విడుదల చేసే వంగడాలను తమ సొంత బ్రాండ్లతో అధిక ధరలకు అమ్ముతున్నాయి. భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) అంచనాల ప్రకారం రైతులకు విక్రయిం చే వంగడాల రకాల్లో ప్రభుత్వ పరిశోధనా సంస్థలు విడుదల చేసినవే 53 శాతం ఉ న్నాయి. 1969 నుంచి ప్రభుత్వం పరిశోధనా సంస్థలో వివిధ పంటలకు సంబంధించి 5,700 రకాల విత్తనాలు విడుదల చేసింది.

2005 భారత్‌లో రైతులు కొనుగోలు చేసిన విత్తనాల్లో 60 శాతానికి పైగా ప్రభుత్వ పరిశోధనా సంస్థలు తయారు చేసిన విత్తనాలే ఉండగా 2020 నాటికి రైతులు కొనుగోలు చేసిన విత్తనాల్లో ప్రైవే టు కంపెనీల భాగస్వామ్యం 64 శాతానికి చేరుకోవడం గమనార్హం. అయితే దేశీయం గా విత్తన పరిశ్రమల వార్షికాదాయం 19 వేల కోట్ల రూపాయలకు చేరుకొని, ప్రతి ఏ టా స్థిరంగా అభివృద్ధి చెందుతోందని భా రత విత్తన పరిశ్రమల సమాఖ్య స్పష్టం చే సింది. కానీ అంతర్జాతీయ మార్కెట్‌లో మా త్రం భారత విత్తన కంపెనీల ఎగుమతులు మాత్రం పెద్దగా కనిపించవు.

ప్రపంచ విత్తన ఎగుమతుల వ్యాపార విలువ ఏటా 11 వేల కోట్ల వరకు ఉంటే, అందులో భారత్ వాటా వెయ్యి కోట్ల రూపాయలు మాత్రమే.  భార త రైతులను మరింత ప్రోత్సహిస్తే, 2028 నాటికి అంతర్జాతీయ మార్కెట్లో భార త్ విత్త న ఎగుమతుల వాటా 10 శాతానికి చేరే అవకాశమున్నది. దేశంలో నేటికీ విత్తన చట్టం లేదు. 2004లో విత్తన చట్టం రూ పొందిం చి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు కానీ కా ర్పొరేట్ ఒత్తిడి కారణంగా ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నది. పటిష్టమైన విత్తనాల చ ట్టం లేకపోవడం వల్ల నాసిరకం విత్తనాల వ్యాపా రం వ్యవస్థీకృతంగా సాగుతున్నది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర పాల కులు పట్టిష్టమైన విత్తన చట్టం తేవాలి.

కార్పొరేట్‌తో కుమ్మక్కు..

ఇక తెలంగాణ రాష్ర్టంలో 64 లక్షల మం దిని రైతులుగా గుర్తించి ప్రభుత్వం వీరందరికీ రైతుబంధు ఇస్తున్నది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల్లో 35 శాతం మంది కౌలు రైతులే. వీరి సంఖ్య 22 లక్షల వరకు ఉంటుంది. కానీ వీరిలో ఎవరికీ రైతు సంక్షేమ పథకాలు అందడం లేదు. భూమి పట్టా లేక రైతుబంధు, రైతుబీమా, పంట రు ణాలు అందడం లేదు. అప్పులు చేసి సాగు చేస్తే పంటలు పకృతి వైపరీత్యాలతో ఆగమై పెట్టిన పెట్టుబడి రాక, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు కూడా ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందడం లేదు.

నిజానికి వాస్తవ కౌలుదారుకు భూమి హక్కులు కల్పించడానికి వీలు కల్పించే 1950, 1956 చట్టాలను అమలు చేయకుండా, ఉమ్మడి ఏపీ ప్రభు త్వం అధీకృత సాగుదారుల చట్టాన్ని 2011 లో తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం కొలుదారులకు చాలా హక్కులు రావు. భూ యజ మానికి భూమి హక్కులు భద్రంగా ఉంటా యి. కౌలుదారుల వ్యవసాయానికి సహా యం మాత్రమే లభిస్తుంది. రైతు పండించిన పంటలకు మద్దతు ధర, గిట్టుబాటు ధర చెల్లించడంలో పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మద్దతు ధర విషయం లో ప్రభుత్వం రైతులకు అనుకూలంగా నిర్ణ యం తీసుకోకపోవడానికి ప్రధాన కారణం కార్పొరేట్ యజమానులతో పాలకులు కుమ్మక్కు కావడమే.

ఒకవేళ రైతంగానికి కనీస మద్దతు ధరను పెంచితే వినియోగదారులు కొనుగోలు చేసే వస్తువులకు రెక్కలు వస్తాయి. ఆ ధరల భారం భరించలేక వినియోగదారులు తమ యాజమాన్యాలను అధిక వేతనాల కోసం డిమాండ్ చేస్తారు. కాబట్టి ప్రభుత్వం కార్పొరేట్లకు ఇబ్బంది కలిగించే పని పెట్టుకోదు. ఈ కారణంతో కార్పొరేట్లకు అనుకూలంగా పనిచేసే పాలకులు రైతు ప్రయోజనాలను పణంగా పెట్టి వారి ఉత్పత్తులకు తక్కువ ధర చెల్లిస్తున్నారు.

నిలువు దోపిడీ..

దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పెరిగినప్పటికీ వ్యవసాయదారుల స్థితిగతులు మాత్రం దిగజారిపోతున్నాయి. 1970- మధ్య కాలంలో 45 ఏళ్ల కాలంలో గోధుమలకు కనీసం మద్దతు ధర కేవలం 19 రెట్లు మాత్రమే పెరగ్గా, అదే కాలంలో ప్రభుత్వ ఉద్యోగుల ఆదాయం 120 రెట్లు పెరిగింది. కానీ పంటల ఉత్పత్తి, వాటి ఆదా యం మాత్రం పెరగడం లేదు. 2014  మధ్య కాలంలో ప్రభుత్వ బ్యాంకుల నుంచి కార్పొరేట్ కంపెనీలు తీసుకున్న 16.61 లక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వం రద్దు చేసింది.

అదే సమయంలో దేశంలో బకాయి ఉన్న వ్యవసాయ రుణా లు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం (1990, 2006) కేవలం రెండుసార్లు మాత్రమే మా ఫీ చేసింది. ఇక తెలంగాణ ప్రభుత్వం 2023 ఎన్నికల ముందు రైతులందరికీ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చా క మాట మార్చి 2 లక్షల లోపు రుణాలు రుణమాఫీ చేసి రైతులను మోసం చేసింది. 

పంట బీమా కల్పించాలి..

మన దేశంలో వ్యవసాయం అంటే ప్రకృతితో జూదం లాంటిది. ఆరుగాలం శ్రమించి పంట పండించినా చేతికందుతుందన్న గ్యా రెంటీ ఉండదు. అందుకే ప్రభుత్వాలు రైతుల పంటలకు బీమా కల్పించాలి. భారత్‌లో తొలిసారిగా 1985లో పంటల భీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. అలాగే 2016 నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా (పీఎంఎఫ్‌బీవై) పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రపంచంలో రైతు ల భాగస్వామ్యం ఉన్న అతి పెద్ద పంటల బీమా పథకంగా పీఎంఎఫ్‌బీవై పేరుగాంచింది. ప్రభుత్వం రంగంలోని ఐదు, ప్రైవేటు రంగంలోని 13 బీమా కంపెనీలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి.

సాధారణ ఖరీ ఫ్ పంటకు బీమా చేసిన మొత్తంలో 2 శా తం, రవి పంటలకు 1.5 శాతం, ఉద్యాన, వా ణిజ్య పంటలకు 5 శాతం చొప్పున గరిష్టం గా ప్రీమియాన్ని రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాల్సి ఉం టుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం 30 శా తం మాత్రమే భరిస్తామని చెప్పడం, దానికి కేంద్రం ఒప్పుకోకపోవడంతో ఈ పథకం మన దగ్గర అమలవ్వడం లేదు. రైతు వ్యవసాయ యంత్ర పరికరాల పథకానికి కూడా గండి పడింది. వీటి కోసం మొత్తం 2.60 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు.

దరఖాస్తుదారులందరికీ పరికరాల ను రాయితీపై పంపిణీ చేసేందుకు రూ.500 కోట్లు నిధులు అవసరమని గుర్తించిన అధికారులు వాటి సమీకరణపై దృష్టి సారించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10,812 మంది లబ్దిదారులకే యంత్రాలను అందించి చేతులు దులుపుకుంది. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా వర్షాకాలంలో రైతాంగానికి 5.98 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేయగా, రైతులకు యూరియా అందజేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి.

 వ్యాసకర్త సెల్: 9963027577