calender_icon.png 21 February, 2026 | 7:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటాయింపుల్లో సహేతుకమేది?

12-02-2026 12:00:00 AM

డాక్టర్ సంగని మల్లేశ్వర్ :

కేంద్రం ప్రవేశపెట్టిన 2026 బడ్జెట్ కొత్తసీసాలో పాతసా ర పోసినట్టు ఎప్పటిలాగే తెలంగాణకు తీవ్ర నిరాశను మిగిల్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి రూ.53,47,315 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన పద్దుల్లో తెలంగాణకు ఇసుమంతైనా కేటాయింపులు లేవు. ‘దేశమం టే మట్టి కాదోయ్ ..దేశమంటే మనుషులోయ్’ అనే గురజాడ మాటలు తెలంగా ణపై నీటి మూటలు అన్నట్టుగా ఉన్నది. నాడు కేసీఆర్‌కు కేంద్ర ప్రభుత్వం లెక్కలేదని, ప్రధాని మోదీ అంటే గౌరవం లేదని వాడిపోసుకున్న  ఎన్డీయే ప్రభుత్వం కేటాయింపులకు మర్యాద తప్పినందుకే దృష్టి పెట్టలేదని కుంటి సాకులు చెప్పింది.

మో దీృ లొల్లి పక్కకుపెడితే నాడు ఎన్డీఏలో ఉన్న ఆంధ్రప్రదేశ్  కోసం మాట్లాడు తున్నారని అనుకున్నాం, అయితే పార్లమెంట్ వేదికగా తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని అక్కసు వెళ్లగక్కిన తెలంగాణ స మాజం తిరగబడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత రేవంత్ మోదీని పెద్దన్నగా వర్ణించారు. పార్టీలు వేరైనా కేంద్రం లో ఉన్న ప్రధానమంత్రి రాష్ట్రాలకు నిధు లు ఇవ్వడంలో, రాష్ట్ర బాగోగులు చూడడంలో సమాన పాత్ర పోషించాల్సి ఉం టుంది. కానీ కేసీఆర్ ఢిల్లీకి రాలేదని, అభివృద్ధి కోసం అడగలేదని ఒకప్పుడు చెప్పి న కేంద్రం ఇప్పుడు ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి. 2014 నుంచి విభజన హామీలను తుంగలొ తొక్కి నిర్లక్ష్యానికి ఒడిగట్టింది.  

బయ్యారం మరిచారు..

ఖనిజ సంపద ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించేందుకు చర్యలు తీ సుకుంటామని నిర్మలా సీతారామన్ పే ర్కొన్నారు. సముద్రతీరాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడులో ప్రత్యేక మైనింగ్ మిషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అయితే అరుదైన ఖనిజ సంపద ఉన్న తెలంగాణ బయ్యారం ఉక్కు కర్మాగారం విషయాన్ని మాత్రం విస్మరించారు. ప్రభు త్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో వసతుల కల్పన కోసం ఏడాదికి రూ. వెయ్యి కోట్ల చొప్పున రూ. 5వేల కోట్లతో పట్టణాభివృద్ధిని బలోపేతం చేసే ఏడూ ఆర్థిక మండ ళ్లలో విశాఖ పట్నానికి చోటు ఇచ్చారు.

కానీ హైదరాబాద్‌కు చోటు ఇవ్వకపోవడం శోచనీయం. తెలంగాణలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా సంగతి పక్కనబెడితే, బడ్జెట్‌లో చిల్లిగవ్వ కూడా కేటా యించలేదు. పారిశ్రామిక,ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా ఉద్యోగ కల్పనకు చేయూతనిచ్చేలా కేంద్రం ఏపీకి బడ్జెట్‌లో వరాల నిచ్చింది. దేశ వ్యాప్తంగా పరుగులు తీసే బుల్లెట్ రైళ్ల కోసం ఏడూ హై స్పీడ్ రైల్వే కారిడార్ ప్రాజెక్టు మినహా ఈసారి బడ్జెట్‌లో తెలంగాణ ప్రస్తావన కనిపించలేదు.

దేశంలో నడిబొడ్డున ఉన్న తెలంగాణకు తప్పని పరిస్థితిలో 1,671 కి.మీ పొడవుతో ఈ మాత్ర మైనా దక్కింది. త్వరలో శాసనసభకు ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాలకు మాత్రం భారీ స్థాయిలో ప్రయోజనాలు కలిగే విధంగా ప్రతిపాదనలు ప్రవేశపెట్టి త మ స్వార్థాన్ని బయటపెట్టింది. అయితే రక్షణకు మాత్రం గత బడ్జెట్ కంటే 15 శాతం అధికంగా కే టాయించడం ముదావహం.   

ప్రతిపాదనలు తుంగలోకి..

ఇక తెలంగాణ కేంద్ర బడ్జెట్ పై గంపెడాశలు పెట్టుకుంది. అప్పుల రాష్ర్టంగా బా ధ్యతలు తీసుకున్న రేవంత్ కేంద్ర ప్రభు త్వం నుంచి సహకారాన్ని ఆశించారు. తెలంగాణ ఏర్పాటు నుంచి పెండింగ్ లో ఉన్న బకాయిలకు మోక్షం కలుగుతుందన్నా ఆశలు అడియాసలయ్యాయి.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ నదీ పునరుద్దరణ, ఆర్‌ఆర్‌ఆర్, మెట్రో రైల్, వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రాష్ర్టంలో విమానాశ్రయాల నిర్మాణాలు, సెమీ కండక్టర్ పరిశ్రమ వంటి దాదాపు 47 ప్రాజెక్టులకు సంబంధించిన పథకాలకు రూ.1.65 లక్షల కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదనలు పెట్టినప్పటికీ కేంద్రం విస్మరించింది.

రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి 60సార్లు ఢిల్లీ వెళ్లినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. కేవలం బీజేపీయేతర ప్రభుత్వం ఉన్నందు నే కేంద్రంలోని ఎన్డీయే  కుట్రలు చేస్తుందనిపిస్తుంది. వారి కేటాయింపుల్లో సహేతుక త లేకపోవడమే ఇందుకు ఉదాహరణ. తెలంగాణ తమకు నిధులు కేటాయించాలని కేంద్రాన్ని బిక్షం అడుక్కోవడం లేదు. వివిధ పన్నుల రూపంలో రూ. 4. 32 లక్షల కోట్లు కేంద్రానికి చెల్లిస్తే, రాష్ట్రానికి తిరిగి ఇవ్వడంలో వివక్ష స్పష్టంగా కనిపిస్తుంది.

సాగులో స్వయం సమృద్ధి సాధించాలంటే రైతు కేంద్రంగా పథకాల రూపకల్పన జరగాలి. వ్యవసాయ అనుకూల సంస్కరణలు అమలు చేయాలి. యువత నైపుణ్యాల పెంపు, పేద, మధ్యతరగతి పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, టెక్స్ టైల్ మెగా క్లస్టర్ జోన్‌ల ఏర్పాటు, మౌలిక వసతుల కోసం అత్యవసర నిధి ఏర్పాటు చేయడం శుభపరిణామం.

తెలంగాణకు అన్యాయం..

ఇటీవల ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్‌లో పేర్కొన్న గణాంకాల ప్రకారం.. 13.71 శాతం కోతపెట్టి స మాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసింది. దేశ జీడీపీ లో తెలంగాణ వాటా 5.01శాతం అయితే కేంద్రం నుంచి రూ.3.76లక్షల కోట్లు ద క్కాలి. కానీ గడచిన ఐదేండ్లలో రూ.1.84 లక్షల కోట్లు అంటే 2.45 శాతం మాత్రమే దక్కింది. ఈ లెక్కన రూ.1.92 లక్షల కోట్లు నష్టపోయింది. డబుల్ ఇంజన్ సర్కార్ అ ని చెప్పుకునే ఎన్డీయే ప్రభుత్వం బీజేపీయేతర ప్రభుత్వాలపై వివక్ష చూపిస్తున్నది. తెలంగాణ ప్రగతికి త్రిముఖ వ్యూహం ‘క్యూర్, ప్యూర్, రేర్’ అనే మూడు రకాల ప్రణాళికలను క్రోడీకరించి సీఎం రేవంత్ విజన్ డాక్యుమెంట్ రూపొందించారు.

రాష్ట్రాన్ని మూడు ఆర్థిక జోన్లుగా విభజించి, అభివృద్ధిని వికేంద్రీకరించేందుకు తెలంగా ణ రైజింగ్ -విజన్, నాటికి ఆర్థిక వ్య వస్థను మూడు ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా సాగుతున్న ప్రాధాన్యతలపై నీళ్లు చల్లింది. ఏపీ ఎంపీలు కొట్లాడి  కేటాయింపులు చేసుకుంటే, తెలంగాణలో బీజేపీ నుంచి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నప్పటికీ రాష్ట్రానికి ఏం తేలేకపోయారు.

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి 8 మం దిని గెలిపించినప్పటికీ తెలంగాణకు అన్యా యం చేస్తున్నది నిజం కాదా? దక్షిణాదిన పాగా వేయాలని కలలు కంటున్న కేంద్రం వైఖరిలో మార్పు రాకపోతే భవిష్యత్తులో రాష్ట్రానికి బడ్జెట్‌లో ‘గుండు సున్నా’ రావ డం ఖాయం. అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ప్రభుత్వ దార్శనికత, ఆర్థిక వృద్ధి, సుపరిపాలన, సామాజిక సాధికారిత లక్ష్యాలు వికసిత్ భారత్‌ను నీరుకా రుస్తుందన్నది సత్యం. 

-  వ్యాసకర్త సెల్:-- 9866255355