calender_icon.png 17 July, 2025 | 3:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వారోత్సవాలకు మావోయిస్టులు సిద్ధం?

17-07-2025 01:39:35 AM

- జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు నిర్వహణ!

- కేంద్రం మిషన్ వ్యతిరేకంగా వ్యూహం?

- కఠోర పరీక్షలకు సన్నద్ధమవుతున్న నక్సల్స్

చర్ల, జూలై 16: కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్‌కు మావోయిస్టు అగ్రనేతల తోపా టు దళ సభ్యులు బలవుతున్నా.. వారోత్సవాలు నిర్వహించేందుక మావోయిస్టు పార్టీ సిద్ధం అయినట్టుగా తెలుస్తున్నది. కేం ద్ర ప్రభుత్వం 2026వరకు  నక్సలిజాన్ని నిర్మూలించేందుకు చేపట్టిన మిషన్‌కు వ్యతిరేకంగా భారీ వ్యూహ రచన చేసేందుకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తున్నది.

జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు వా రోత్సవా లు నిర్వహిస్తున్నట్టు మావోయిస్టు కేంద్ర కమిటీ విడుదల చేసిన 22 పేజీల బుక్‌లేట్‌లో వెల్లడించింది. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వ మిషన్ 2026ను విఫలం చేయడానికే మావోయిస్టు పార్టీ ఇప్పుడు పెద్ద వ్యూహాన్ని రూపొందించినట్టు సమాచారం.

మిషన్ 2026ను విఫ లం చేయడానికి కేంద్ర కమిటీ, పీబీ రూపొందించిన వ్యూహాన్ని ఆచరించాలని కేంద్ర కమిటీ దేశంలోని వివిధ రాష్ట్రాల మావోయిస్టులను కోరినట్టుగా తెలుస్తున్నది. నిరంతర నష్టాల తర్వాత, మావోయిస్టులు ఇప్పుడు ఎన్‌కౌంటర్ సమయంలో కమాండ్ తీసుకోవడం, కొత్త పద్ధతులు, యుక్తులు, ముట్టడిని ఛేదించే పద్ధతులు, చాలా గంటలు, కొన్ని రోజులు ఆకలిని తట్టుకోవడం, సుదీర్ఘ ప్ర యాణాలు చేయడం వంటి నైపుణ్యాలను నేర్చుకుంటున్నారని సమాచారం.

అయితే నక్సల్బరీ దాడి తర్వాత ఏడాదిలో తొలిసారిగా దేశంలో 4 సీసీఎంలు ధ్వంసమ య్యాయని, ప్రతి 15 రోజులకు ఒకసారి కేంద్ర బలగాల దాడులు కొనసాగుతున్నాయని మావోయిస్టులు పేర్కొన్నారు. ప్రతి దాడిలోనూ 10 నుంచి 20 మంది  చనిపోతున్నారని, 3 నుంచి 20 మంది గాయప డుతున్నారని పేర్కొన్నారు. బలగాలు చేసే ప్రతి దాడిలోనూ, కామ్రేడ్స్ 2-2 రోజులు పోరాడుతారు. వారు వేలాది మంది సైనికుల ముట్టడిని ఛేదించి బయటకు వస్తున్నా రని తెలిపారు. 

లొంగిపోతున్న మావోయిస్టులు

పోలీస్ వ్యవస్థ ప్రవేశపెట్టిన ‘లోన్ వరా టో’, ‘ఆపరేషన్ చేయూత’ వంటి సంక్షేమ పథకాల ద్వారా మావోయిస్టులు, సానుభూతిపరులు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. ఛత్తీస్‌గఢ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట 86 మంది లొంగిపోయారు. ములుగు ఎస్పీ శబరిష్ ముందు మరి కొందరు  మావోయిస్టులు లొంగిపోయారు. వయసు మీద పడ టం, మునుపటిలా భద్రత లేకపోవడం, అనారోగ్యం భద్రతా దళాల దాడులు మొ త్తంగా సీనియర్ మావోయిస్టులు లొంగుబాటుపై ఆలోచన చేస్తున్నారు.

మంగళవారం ఆత్రం లచ్చన్న దంపతులు రామగుండం కమిషనర్ ముందు లొంగిపోగా బుధవారం ఏపీలో మావోయిస్టు దంపతులు రామకృష్ణ, అరుణ పోలీసుల ఎదుట లొంగిపో యారు. మావోయిస్టుల లొంగుబాటుతో ఆ పార్టీ బలాన్ని కోల్పోతుందని చెప్పవచ్చు.

మావోయిస్టులను పూర్తిగా మట్టు పెడతాం అని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించిన విధంగానే ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో సుమారు 350 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్లుగా, సుమారు 245 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయినట్లుగా, సుమారు 260 మంది మావో యిస్టులు అరెస్ట్ అయినట్లుగా అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తుంది. ఇవి కాక అనధికారిక లెక్కల ప్రకారం మరికొందరు సాను భూతిపరులను పోలీస్‌లు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దీంతో మావోయి స్టుల సంఖ్యాబలం క్షీణిస్తూ వస్తోంది. 

పేలుడు పదార్థాల స్వాధీనం 

చత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలోని భేజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోసల్మడుగు అడవుల్లో దాచిపెట్టిన పేలుడు పదార్థాలను బుధవారం కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టులు భద్రతా దళాల పై పెద్ద దాడి చేయడం కోసమే పేలుడు పదార్థాలు అమర్చినట్టు తెలిసింది. డిఆర్‌జి 50, 219 సి ఆర్ పి ల సంయుక్త ఆపరేషన్‌లో 15 కిలోల అమ్మోనియా నైట్రేట్ పౌ డర్ డిటోనేటర్లు, జెలటిన్‌తో సహా పెద్ద మొ త్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణ అడవులకు మకాం

ఛత్తీస్‌గఢ్ దండ కారణ్యం నుంచి మావోయిస్టులు తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతాల్లోకి మకాం మార్చిన ట్లు గత కొద్ది నెలలుగా జరుగుతున్న ఘటనలు చూస్తే అర్థమవుతున్నది. గోదావరి పరివాహక అటవీ ప్రాం తాల్లో మావోయిస్టులు తలదాచుకుంటున్నట్లు తెలుస్తున్నది.