17-07-2025 01:41:16 AM
- పథకం కోసం ఏడాదికి 24వేల కోట్ల కేటాయింపులు
- ఎన్టీపీసీకి 20 వేల కోట్ల పెట్టుబడులకు అనుమతి
- శుభాంశు బృందానికి మంత్రివర్గం అభినందన
- ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ భేటీ
న్యూఢిల్లీ, జూలై 16: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం బుధవారం ఢిల్లీలో జరిగింది. ఈ భేటీలో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. దేశంలో రైతుల అభ్యున్నతికి ప్రాధాన్యతనిస్తూ ‘పీఎం ధన్ ధాన్య కృషి యోజన’కు ఆమోద ముద్ర వేసినట్టు పేర్కొన్నారు.
వ్యవసాయ, అనుబంధ రంగాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఏటా రూ.24 వేల కోట్ల వ్యయం తో దేశ వ్యాప్తంగా 100 జిల్లాల్లో కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. 2025 నుంచి ఆరేళ్ల కాలానికి వంద జిల్లాలను కవర్ చేసేలా దీన్ని చేపట్టనున్నారు.
ఈ పథకం వల్ల ప్రతి ఏడాది దేశంలోని 1.70 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుందని వెల్లడించారు. పునరుత్పాదక ఇంధనంలో ఎన్‌టీపీసీకి (జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్) రూ.20వేల కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు. యాక్సి యం మిషన్ లో భాగంగా అంతర్జాతీయ అంతరి క్ష కేంద్రం లో 18 రోజుల పా టు గడిపిన శు భాంశు శుక్లా బృం దాన్ని అభినంది స్తూ కేంద్ర క్యాబినె ట్ తీర్మానం చేసిందని పేర్కొన్నారు.
ఏమిటీ పీఎం ధన్ ధాన్య కృషి యోజన?
వ్యవసాయ రంగంలో దిగుబడి పెంచ డం పీఎం ధన్ కృషి యోజన పథకం ముఖ్య ఉద్దేశం. పంటలను మార్చి సాగు చేయడం, ఆధునిక వ్యవసాయ పద్దతులను ప్రోత్సహించడమే దీని లక్ష్యం. పంట కోత తర్వాత గ్రామస్థాయిలో దిగుబడులను నిల్వ చేసేందుకు గోదాముల సదుపాయం, నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడం, రుణ లభ్యతను సులభతరం చేయడమే లక్ష్యంగా పీఎం ధన్ ధాన్య కృషి యోజనను రూపొందించారు.
మొత్తం 11 శాఖల్లో 36 పథకాలు, రాష్ట్రంలోని ఇతర పథకాలు, ప్రైవే టు రంగంలో స్థానిక భాగస్వామ్యం ద్వారా దీన్ని అమలు చేయనున్నారు. ఉత్పాదకత తక్కువగా ఉండటం, అన్ని రుతువుల్లోనూ పంట సాగుబడి చేయకపోవడం, రుణ లభ్య త అత్యంత తక్కువగా ఉండటం అనే మూ డు కీలక సూచికల ఆధారంగా 100 జిల్లాలను గుర్తిస్తారు.
ఈ పథకం సమర్థవంతంగా అమలు జరిగేలా పర్యవేక్షించేందుకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో కమిటీలను ఏర్పా టు చేయనున్నారు. ప్రతి ధన్ జిల్లా లో ఈ పథకం పురోగతిని 117 ఫర్మామెన్స్ ఇండికేటర్ల ద్వారా పర్యవేక్షిస్తారు.